Warangal: ఎంజీఎంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం.. చికిత్స పొందుతున్న కోవిడ్ పేషంట్ మృతి

|

Mar 20, 2021 | 2:25 PM

Covid-19 patient died: పెద్దాసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ కోవిడ్ పేషెంట్ బలయ్యాడు. విద్యుత్ సరఫరాకు

Warangal: ఎంజీఎంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం.. చికిత్స పొందుతున్న కోవిడ్ పేషంట్ మృతి
Covid 19
Follow us on

Covid-19 patient died: పెద్దాసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ కోవిడ్ పేషెంట్ బలయ్యాడు. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న కరోనా రోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన వరంగల్‌లోని ఎంజీఎం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. శనివారం ఉదయం నుంచి ఆసుపత్రిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమి చేపట్టకపోవడంతోనే కోవిడ్ పేషెంట్ మరణించినట్లు పలువురు పేర్కొంటున్నారు.

వరంగల్ అర్బన్ జిల్లా కమలాపురం గ్రామానికి చెందిన గాంధీ అనే వ్యక్తికి కరోనా సోకడంతో 25 రోజుల క్రితం ఎంజీఎం ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో శ్వస తీసుకోవడం ఇబ్బందులు తలెత్తడంతో రెండు రోజుల నుంచి వెంటిలేటర్‌పై శ్వాస పొందుతున్నాడు. విద్యుత్ మరమ్మతు పనుల్లో బాగంగా అధికారులు శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని.. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ముందే సూచించారు. కానీ ఎంజీఎం సిబ్బంది ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదు. దీంతో ఆసుపత్రిలోని పలు వార్డుల్లో వెంటిలేటర్లన్నీ నిలిచిపోయాయి. ఈ క్రమంలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న గాంధీకి శ్వాస అందకపోవడంతో మృతి చెందాడు. దీంతో మృతుడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన అనంతరం పలువురు ఎంజీఎం వైద్యుల నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Also Read: