మేడారం జంపన్నవాగులో ఆటో గల్లంతు.. ప్రాణాలతో బయటపడ్డ ఆటో డ్రైవర్.. ఎలాగంటే..

| Edited By: Jyothi Gadda

Jul 17, 2024 | 9:08 PM

గల్లంతైన ఆటో డ్రైవర్లు కూడా స్థానికులు సురక్షితంగా బయటకు తీశారు.. జంపన్న వాగు వరద ఉధృతిని అంచనా వేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ వెంటనే ఆటోలో నుండి దూకి బయటపడటంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. లేకపోతే పెద్ద ప్రమాదం జరిగేది.. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో అంతా ఊపిరిపించుకున్నారు.

మేడారం జంపన్నవాగులో ఆటో గల్లంతు.. ప్రాణాలతో బయటపడ్డ ఆటో డ్రైవర్.. ఎలాగంటే..
Jampannawagu
Follow us on

ములుగు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జంపనవాగు ఉగ్రరూపం దాల్చింది..ఉదృతంగా ప్రవహిస్తుంది.. వరద ఉధృతిని అంచనా వేయకుండా లో లెవెల్ కాజ్ వే దాటుతుండగా ఓ ఆటో వాగులో గల్లంతయింది.. వాగులో కొట్టుకుపోయిన ఆటోను స్థానికులు బయటకు తీశారు.. స్థానికుల సహాయంతో ఆటో డ్రైవర్ ప్రాణాలతో బయట పడ్డాడు. ఈ ప్రమాదం ములుగు జిల్లా తాడ్వాయి మండలం చింతల్ క్రాస్ వద్ద జరిగింది.. వినోద్ అనే ఆటో డ్రైవర్ నిత్యవసర వస్తువులు తన ఆటోలో వేసుకొని నార్లాపూర్ వైపు వెళ్తున్నాడు.. ఈ క్రమంలో చింతల్ క్రాస్ వద్ద లో లెవెల్ కాజ్వే దాటుతుండగా వరద ఉధృతికి ఆటో వాగులో కొట్టుకుపోయింది.

ఆటోలో నుండి బయటకు దిగిన ఆటో డ్రైవర్ వినోద్ సురక్షితంగా బయటపడ్డాడు ఆటో బయట కొట్టుకపోతుండగా, స్థానికులు గమనించి ఆటోను బయటకు తీశారు. గల్లంతైన ఆటో డ్రైవర్లు కూడా స్థానికులు సురక్షితంగా బయటకు తీశారు.. జంపన్న వాగు వరద ఉధృతిని అంచనా వేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. ఆటో డ్రైవర్ వెంటనే ఆటోలో నుండి దూకి బయటపడటంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. లేకపోతే పెద్ద ప్రమాదం జరిగేది.. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలో ప్రయాణికులు ఎవరు లేకపోవడంతో అంతా ఊపిరిపించుకున్నారు.

విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ ధినకర, ఎస్పీ శబరీష్ ప్రమాదంపై ఆరా తీశారు.. జిల్లా వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.. చెరువులు నిండాయి… ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి ఎవరు అతి ఉత్సాహంతో వాగులు దాటవద్దని సూచించారు.. వాగులో వరద ఉధృతి తగ్గిన తర్వాతే నిత్య కార్యక్రమాలు చూసుకోవాలని ఆదేశించారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..