Telangana: ర్యాగింగ్‌ భూతానికి మరో యువతి బలి.. విద్యార్థి వేధింపులు తాళలేక బీటెక్‌ విద్యార్థిని ఆత్మహత్య

| Edited By: Anil kumar poka

Feb 27, 2023 | 7:04 AM

మెడికో స్టూడెంట్‌ ప్రీతి ఘటన మరవకముందే ర్యాగింగ్‌ భూతానికి మరో విద్యార్థిని బలైంది. తోటి విద్యార్థి వేధింపులు తాళలేక మరో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మెడికో స్టూడెంట్‌ ప్రీతి ఘటన మరవకముందే ర్యాగింగ్‌ భూతానికి మరో విద్యార్థిని బలైంది. తోటి విద్యార్థి వేధింపులు తాళలేక మరో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. వరంగల్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భూపాలపల్లికి చెందిన శంకరాచారి, రమ దంపతులు. వీరికి రక్షిత (20) అనే అమ్మాయి ఉంది. వరంగల్ జిల్లా నర్సంపేట లోని జయముఖి ఇంజనీరింగ్ కళాశాలలో ఈసీ మూడవ సంవత్సరం చదువుతోంది. అయితే రక్షితకు చెందిన ఫొటోలను ఓ విద్యార్థి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశాడు. దీంతో మనస్థాపానికి గురైన యువతి.. వరంగల్ నగరంలోని తన బంధువుల ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు. మరోవైపు ప్రీతి లాగే తమ కూతురు కూడా సీనియర్ల వేధింపులకు బలయిందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వరంగల్‌ కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన పీజీ విద్యార్థి ప్రీతి సీనియర్ల వేధింపులకు బలైన ఘటన జరుగుతుండగానే.. అదే జిల్లాలో మరో విద్యార్ధిని వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది.

రక్షిత బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. గత కొంతకాలంగా ఓ విద్యార్థి ఆమెను వేధిస్తున్నట్లు తెలుస్తోంది. వేధింపుల మరింత ఎక్కువ కావడంతో భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తోన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు సిద్దమవుతున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలేజీ విద్యార్థులు డిమాండ్ చేస్తోన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం.. క్లిక్ చేయండి..