Preethi Incident: వాళ్లందరూ ఒక్కటయ్యారమ్మా.. నన్ను దూరం పెడుతున్నారు.. కాల్ రికార్డింగ్ లో షాకింగ్ విషయాలు..
మెడికో విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నారు. సీనియర్ వేధింపులు తట్టుకోలేక ఇంజక్షన్ తో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న ప్రీతి.. ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది. ఈ క్రమంలో..

మెడికో విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో షాకింగ్ విషయాలు బయటపడుతున్నారు. సీనియర్ వేధింపులు తట్టుకోలేక ఇంజక్షన్ తో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్న ప్రీతి.. ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతోంది. ఈ క్రమంలో ఘటన జరిగిన ముందు రోజు ప్రీతి తన తల్లితో మాట్లాడిన ఆడియో సంభాషణ బయటకు వచ్చింది. ఫోన్ కాల్ లో ప్రీతి తన బాధను తల్లి తో చెప్పుకుని కన్నీటిపర్యంతమైంది. సైఫ్ నాతో పాటు చాలా మంది జూనియర్ లని వేధిస్తున్నాడని చెప్పింది. సీనియర్లంతా ఒకటేనని వాపోయింది. నాన్న పోలీసులతో ఫోన్ చేయించినా లాభం లేకుండా పోయిందని కన్నీటిపర్యంతమైంది. సైఫ్ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని తల్లితో చెప్పుకుంటూ బాధపడింది. నేను సైఫ్ పై ఫిర్యాదు చేస్తే సీనియర్లందరూ ఒకటైపోయి నన్ను దూరం పెడతారని భయపడింది. సైఫ్ తో మాట్లాడి ఇబ్బంది లేకుండా చేస్తానని ప్రీతి తల్లి ఓదార్చినా లాభం లేకుండా పోయింది. హెచ్ఓడీ నాగార్జున రెడ్డి ఏదైనా ఉంటే నా దగ్గరికి రావాలి కానీ.. ప్రిన్సిపాల్ కి ఎందుకు ఫిర్యాదు చేశారని నన్ను దూషించారని చెప్పింది. అన్ని దారులూ మూసుకుపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కాల్ రికార్డ్ ద్వారా తెలుస్తోంది.
కాగా.. వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఆత్మహత్యకు యత్నించే ముందు ఆమె తన తల్లికి ఫోన్ చేసింది. ప్రీతి తన బాధను పంచుకుంది. ఈ ఫోన్ కాల్‌కి సంబంధించిన ఆడియో క్లిప్ బయటకు వచ్చింది. సీనియర్ వేధింపులు తాళలేక ఆత్మహత్యయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతికి నిమ్స్‌లో చికిత్స కొనసాగుతోంది. ప్రత్యేక వైద్య బృందం ఆమెకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. అయితే ప్రీతి ఆరోగ్యం మాత్రం ఇంకా విషంగానే ఉందని వైద్యులు తెలిపారు.
మరోవైపు.. ప్రీతి ఆత్మహత్యయత్నానికి సీనియర్ వైద్య విద్యార్థి ఎంఏ సైఫ్ వేధింపులే కారణమని తేలింది. ఘటనపై ప్రీతి కుటుంబ సభ్యుల ఆరోపణలు.. మెడికల్ కాలేజీ, ఎంజీఎం హెచ్‌ఓడీ వర్గాలు చెప్తున్న అంశాలు భిన్నంగా ఉండటంతో పోలీసులు సెల్‌ఫోన్, వాట్సాప్ గ్రూపులలో చాటింగ్‌ల ఆధారంగా విచారణ జరిపారు. ఈ కేసులో నిందితుడైన సైఫ్‌ను అరెస్టు చేసినట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..