Telangana: ఎవరు ఈ టీమ్-డీ…? ఎందుకు ఆ నియోజకవర్గంలో సందడి చేస్తున్నారు..?
Warangal News, September 26: వరంగల్ నగరంలో టీం ఢీ పేరుతో కొంతమంది యువకులు చేస్తున్న హడావుడి, సేవా కార్యక్రమాలు అన్నదానాలు ఇప్పుడు జనంలో ఒక్కసారిగా హాట్ టాపిక్ గా మారాయి. దాదాపు 100 మంది యువకులు మొన్న వదరల సమయంలో మేము సైతం అన్నారు.. ఇప్పుడు వివిధ కాలనీలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ హార్ట్ టాపిక్ అయ్యారు.. టీం డీ పేరుతో టీషర్ట్స్ ధరించి వినాయక మండపాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు స్వయంగా వెళ్లి అన్నదానాలు చేస్తున్నారు. ఆహార ప్యాకెట్స్ తీసుకొని వెళ్ళి వారి ఆకలి తీర్చే ప్రయత్నాలు చేస్తు జనంలో మమేకమవుతున్నారు.

అసలు ఎవరు ఈ టీం- డీ ,ఎందుకు ఇంతలా ఒక్కసారిగా హడావుడి చేస్తున్నారనే చర్చ జనంలో మొదలైంది.. టీం – డీ అంటే ఢీ ఫర్ దాస్యం వినయ్ బాస్కర్.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ అభిమానులే ఈ విధంగా టీం- డీ గా జట్టు కట్టారు.. దోమకుంట్ల సంతోష్ – రాజ్ కుమార్ నేతృత్వంలో వీరంతా వినూత్న రీతిలో సేవా కార్యక్రమాలు చేస్తూ జనంలో హాట్ టాపిక్ అయ్యారు. ముఖ్యంగా గణపతి మండపాల వద్ద అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ జనం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
రాత్రి పూట రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్దకు వెళ్లి యాచకులకు ఆకలి తీరుస్తున్నాను. ఫుట్ పాత్ పైన జీవితాన్ని గడుపుతున్న వారికి ఆహార ప్యాకెట్లు అందించి ఆకలి తీర్చే ప్రయత్నాలు చేస్తున్నారు. టీం – డీ పేరుతో టి షర్ట్స్ ధరించి ఈ యువత చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. చీఫ్ వినయ్ భాస్కర్ కూడా వీరితో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఆధ్యాత్మిక భావనతో పాటు పొలిటికల్ మైలేజ్ వర్కౌట్ చేసుకుంటున్నారు. దీంతో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయ చర్చ మొదలైంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..