Warangal West Election Result 2023: వరంగల్ పశ్చిమలో ఎగిరిన కాంగ్రెస్ జెండా.. నాయిని రాజేందర్ రెడ్డి ఘన విజయం..

Warangal West Assembly Election Result 2023 Live Counting Updates: వరంగల్ పశ్చిమ నియోజకవర్గం (జనరల్).. వరంగల్ నగరంలో కీలకమైన అసెంబ్లీ స్థానం.. జిల్లాల పునఃర్విభజనతో ఏర్పడిన హనుమకొండ జిల్లా కేంద్రంగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో భిన్న రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ.. పశ్చిమ నియోజకవర్గంలో ఎప్పుడూ బీఆర్ఎస్‌కే అనుకూలమైన తీర్పువస్తోంది.

Warangal West Election Result 2023: వరంగల్ పశ్చిమలో ఎగిరిన కాంగ్రెస్ జెండా.. నాయిని రాజేందర్ రెడ్డి ఘన విజయం..
Warangal West Assembly
Follow us

|

Updated on: Dec 03, 2023 | 5:36 PM

Warangal West Assembly Election Result 2023 Live Counting Updates: వరంగల్ పశ్చిమ నియోజకవర్గం.. వరంగల్ నగరంలో కీలకమైన అసెంబ్లీ స్థానం.. జిల్లాల పునఃర్విభజనతో ఏర్పడిన హనుమకొండ జిల్లా కేంద్రంగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో భిన్న రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ.. పశ్చిమ నియోజకవర్గంలో ఎప్పుడూ బీఆర్ఎస్‌కే అనుకూలమైన తీర్పువస్తోంది. అధికార పార్టీ బీఆర్ఎస్ కు ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ గట్టి పోటీ ఇస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీలకు జిల్లా అధ్యక్షులుగా సారథ్యం వహిస్తున్న నేతలే వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి  ఇక్కడి నుంచి పోటీచేస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది. వరంగల్ పశ్చిమ నుంచి ఇప్పటికే నాలుగుసార్లు గెలిచిన దాస్యం వినయ్ భాస్కర్.. ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి నాయిని రాజేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. బీజేపీ నుంచి పోటీ చేసిన రావు పద్మ మూడో స్థానంలో నిలిచారు. పశ్చిమలో ప్రధానంగా మూడు ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొనగా.. నాయిని రాజేందర్ రెడ్డి ఘన విజయం సాధించారు.

తెలంగాణ ఎన్నికల ఫలితాలు 2023 లైవ్

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 2,86,688 ఓటర్లు ఉన్నారు. వీరిలో  1,41,736 మంది పురుష ఓటర్లు, 1,44,939 మంది మహిళా ఓటర్లు. నవంబరు 30న జరిగిన పోలింగ్‌లో ఈ నియోజకవర్గంలో 56.61శాతం ఓటింగ్ నమోదయ్యింది.

డీలిమిటేషన్ తర్వాత..

2009 డీలిమిటేషన్ తర్వాత పశ్చిమ నియోజకవర్గంలో వినయ్ భాస్కర్ పశ్చిమలో గెలుస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ చీప్ విప్‌గా హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. పదవులకు తోడు కాంగ్రెస్, బిజేపిలోని గ్రూప్ రాజకీయాలు వినయ్ భాస్కర్‌కు అనుకూలంగా మారుతాయన్న ప్రచారం జరగుతోంది.

2018 ఎన్నికల్లో దాస్యం వినయ్ భాస్కర్ (టీఆర్ఎస్) 36,451 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి (టీడీపీ)పై విజయం సాధించారు. వినయ్ భాస్కర్‌కి 81,006 ఓట్లు దక్కగా.. రేవూరికి 44,555 ఓట్లు పోల్ అయ్యాయి.

2014 ఎన్నికల్లో దాస్యం వినయ్ భాస్కర్ (టీఆర్ఎస్) తన సమీప ప్రత్యర్థి స్వర్ణ ఎర్రబెల్లి(కాంగ్రెస్)పై 56,304 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దాస్యం వినయ్ భాస్కర్‌కు 83,492 ఓట్లు పోల్ కాగా.. స్వర్ణ ఎర్రబెల్లికి 27,188 ఓట్లు పోల్ అయ్యాయి.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 2010లో ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలోనూ దాస్యం వినయ్ భాస్కర్ (టీఆర్ఎస్) 67 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్

తెలంగాణ పోలింగ్ ఫలితాల లైవ్ కౌంటింగ్ అప్‌డేట్స్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పార్టీల ఫలితాలు లైవ్