
సీనియర్ల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ప్రీతి అవయవాలు దెబ్బతినడంతో పాటు బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయినట్లు వైద్యులు చెబుతురన్నారు. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగుతోంది. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్‌లో వేధింపులు తాళలేక వైద్య విద్యార్థిని ప్రీతి బుధవారం నాడు మత్తు ఇంజక్షన్ వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. వెంటనే అలర్ట్ అయిన సహ విద్యార్థులు, వైద్య సిబ్బంది ఆమెకు చికిత్స అందించారు. మెరుగైన వైద్యం అధిక మోతాదులో మత్తుమందు తీసుకోవడంతో పరిస్థితి విషమించింది. దాంతో ఆమెను హైదరాబాద్ నిమ్స్‌కి తరలించారు. ప్రస్తుతం నిమ్స్‌లో ప్రీతికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.
వైద్య విద్యార్థిని ప్రీతి ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళనబాట పట్టాయి. వరంగల్ కేఎంసీ లో రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. ప్రీతిపై వేధింపులకు పాల్పడిన సీనియర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశఆరు. ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై హైలెవల్ కమిటీతో విచారణ చేపట్టాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..