BRS vs Congress: తెలంగాణలో చల్లారని కరెంట్‌ మంటలు.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ మధ్య హైవోల్టేజ్‌ డైలాగ్‌ వార్‌..

Telangana Politics: ఉచిత విద్యుత్‌పై బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ మధ్య హైవోల్టేజ్‌ వార్‌ కంటిన్యూ అవుతోంది. ఒకవైపు బీఆర్‌ఎస్‌, ఇంకోవైపు కాంగ్రెస్‌... రెండు పార్టీలు కూడా తగ్గేదే లేదంటున్నాయ్‌!. మాటకు మాట, సవాల్‌కి ప్రతి సవాల్‌, కౌంటర్‌కి రీకౌంటర్‌ ఇస్తూ పవర్‌ ఫైట్‌ని హీటెక్కిస్తున్నారు.

BRS vs Congress: తెలంగాణలో చల్లారని కరెంట్‌ మంటలు.. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ మధ్య హైవోల్టేజ్‌ డైలాగ్‌ వార్‌..
Telangana Politics

Updated on: Jul 18, 2023 | 8:57 AM

Telangana Politics: ఉచిత విద్యుత్‌పై బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ మధ్య హైవోల్టేజ్‌ వార్‌ కంటిన్యూ అవుతోంది. ఒకవైపు బీఆర్‌ఎస్‌, ఇంకోవైపు కాంగ్రెస్‌… రెండు పార్టీలు కూడా తగ్గేదే లేదంటున్నాయ్‌!. మాటకు మాట, సవాల్‌కి ప్రతి సవాల్‌, కౌంటర్‌కి రీకౌంటర్‌ ఇస్తూ పవర్‌ ఫైట్‌ని హీటెక్కిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు కరెంట్‌నే నమ్ముకున్నట్టుగా మాటల యుద్ధం చేస్తున్నాయి పార్టీలు. వారంరోజులుగా జరుగుతోన్న ఈ పవర్‌ ఫైట్‌ ఇప్పుడు మరింత ముదిరి నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లింది. ఈ కరెంట్‌ మంటలు ఇప్పట్లో చల్లారేటట్టే కనిపించడం లేదు. పవర్‌ కోసం పవర్‌ చుట్టూ పొలిటికల్‌ ఫైట్‌ చేస్తున్నాయ్‌ బీఆర్‌ఎస్‌ అండ్ కాంగ్రెస్‌. ప్రతిరోజూ హాట్‌ అండ్ హీట్‌ స్టేట్‌మెంట్స్‌తో మంటలు చల్లారకుండా కాకరేపుతున్నారు. సవాళ్లు-ప్రతి సవాళ్లు, ఛాలెంజ్‌లు-రెఫరెండమ్స్‌ అంటూ పవర్‌ ఫైట్‌ని ఎక్కడికో తీసుకెళ్తున్నారు. రేవంత్‌ అండ్‌ కాంగ్రెస్‌ టార్గెట్‌గా బీఆర్‌ఎస్‌ మాటల తూటాలు ఎక్కుపెడుతుంటే, కౌంటర్‌గా హైవోల్టేజ్‌ సవాళ్లు విసురుతోంది కాంగ్రెస్‌.

ఎవరిని టార్గెట్‌ చేయాలో, ఎక్కడ కొట్టాలో అక్కడే కొడుతోంది బీఆర్‌ఎస్‌. ఒకపక్క కాంగ్రెస్‌, ఇంకోపక్క రేవంత్‌ను టార్గెట్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ పవన్‌ గేమ్‌ ఆడుతోంది. మంత్రులు, బీఆర్‌ఎస్‌ లీడర్స్‌తో హాట్‌ కామెంట్స్‌ చేయిస్తూ ఉచిత విద్యుత్‌ మంటలు ఆరకుండా చూస్తోంది.

బీఆర్‌ఎస్‌ ఆ రేంజ్‌లో చెలరేగిపోతుంటే, కాంగ్రెస్‌ ఊరుకుంటుందా!. ఆ పార్టీ లీడర్స్‌ కూడా అదే స్థాయిలో బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరుగుతున్నారు. సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుతూనే.. ఎదురుదాడి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మొత్తానికి కరెంట్‌ రాజకీయం తెలంగాణలో కాకరేపుతోంది. సింగిల్‌ లైన్‌లో చెప్పాలంటే, టోటల్‌ తెలంగాణ పొలిటికల్‌ పిక్చర్‌నే మార్చేసింది పవర్‌ ఫైట్‌. అసెంబ్లీ ఎన్నికలకు టైమ్‌ దగ్గరపడుతోన్నవేళ ఈ ఉచిత విద్యుత్‌ ఇష్యూ.. పొలిటికల్‌ వెపన్‌గా మారుతోంది. మరి, పవర్‌ కోసం జరుగుతోన్న ఈ పొలిటికల్‌ పవర్‌ ఫైట్‌.. ఏ పార్టీకి అడ్వాంటేజ్‌గా మారుతుందో! ఏ పార్టీని ముంచేస్తుందో ఐదారు నెలల్లో తేలిపోనుంది!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..