Congress: టీకాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..? జడ్చర్ల సభలో ఆసక్తికరణ పరిణామం.. పంచ్‌లతో హీట్..

మొన్న ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌..ఇప్పుడు పంచ్‌లు..! రేవంత్‌ టార్గెట్‌గా..కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రెచ్చిపోతున్నారా? తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో ఆధిపత్యపోరు మరింత ముదురుతోందా..? కోమటిరెడ్డి వర్సెస్‌ రేవంత్‌రెడ్డిగా మారిందా..? జడ్చర్ల కాంగ్రెస్‌ సభ వేదికపై రేవంత్‌కు కోమటిరెడ్డి సవాల్‌ చేయడం వెనుక టార్గెట్‌ ఏంటి..? ఇంతకీ టి కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..?

Congress: టీకాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది..? జడ్చర్ల సభలో ఆసక్తికరణ పరిణామం.. పంచ్‌లతో హీట్..
Telangana Congress

Updated on: May 26, 2023 | 9:40 AM

జడ్చర్ల కాంగ్రెస్‌ సభలో ఆసక్తికరణ పరిణామం చోటుచేసుకుంది. రేవంత్‌రెడ్డి టార్గెట్‌గా ఎంపీ కోమటిరెడ్డి పంచ్‌లు వేశారు.. రేవంత్ రెడ్డి కూడా అదే రీతిలో కౌంటర్ ఇచ్చారు. జడ్చర్ల కాంగ్రెస్‌ సభలో మాట్లాడిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీని తాము గెలిపిస్తామని.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సరదాగా సవాల్ విసిరారు. అయితే, రేవంత్ రెడ్డి కూడా కోమటిరెడ్డి సవాల్‌కు స్పందించారు. 12 కాదని, 14 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు పార్లమెంట్‌ స్థానాలను కూడా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మొన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 60వ పుట్టినరోజు వేడుకల్లోనూ సీఎం పదవిపై కీలక కామెంట్స్ చేశారు. తనకు ఆ పదవిపై ఆశ లేదని అన్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎంగా ఎవరున్నా.. తాను ఓ మిస్డ్ కాల్ ఇస్తే చాలు హెలికాప్టర్ వేసుకొని తన నియోజవర్గానికి వస్తారన్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభలో రేవంత్‌రెడ్డికి ఈ సవాల్‌ చేయడం వెనుక కోమటిరెడ్డి టార్గెట్‌ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. టి.కాంగ్‌లో ఈ ఇద్దరి నేతల మధ్య ఆధిపత్యపోరు మరింత ముదిరిపోయిందనే టాక్‌ వినిపిస్తోంది.

ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలపై నిత్యం ఏదో రకమైన కామెంట్స్ చేస్తూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు కోమటిరెడ్డి. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దళిత అభ్యర్థిని సీఎం చేయాలంటూ ఆయన ఇటీవల కీలక కామెంట్స్ చేశారు. ప్రస్తుతం టీపీసీసీ రేవంత్, ఉత్తమ్, జానా రెడ్డి వంటి సీనియర్ నేతలు ఆ పదవికి పోటీ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తుండగా..అలాంటి సమయంలో కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ టీ కాంగ్రెస్‌లో కాక రేపాయి. మొత్తానికి సిట్చువేషన్‌ ఎలా ఉన్నా..తగ్గేదేలా అనేలా వ్యవహరిస్తున్నారు కోమటిరెడ్డి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..