Telangana: ఎన్నికల వేళ కాంగ్రెస్‎లో భగ్గు మంటున్న వర్గ పోరు.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే..

| Edited By: Srikar T

May 08, 2024 | 12:18 PM

పార్లమెంట్ ఎన్నికల వేళ వరంగల్ కాంగ్రెస్‎లో గ్రూప్ వర్క్ కాక రేపుతోంది. ఏకంగా రాష్ట్ర మంత్రి.. అధికార పార్టీ ఎమ్మెల్యే మధ్య డైలాగ్స్ వార్ ఆడియో ఆసక్తికర చర్చగా మారింది. ఏం దంకీ ఇస్తున్నావా అని ఎమ్మెల్యే మంత్రిని ప్రశ్నిస్తే.. దమ్కీ కాదు తగ్గేదే లే పరకాలలో నా గ్రూపు నీ గ్రూపు తేల్చుకుందాం అని మంత్రి హెచ్చరించడం కాక రేపుతోంది. పార్టీలో చేరికల విషయంలో వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ కావటం తీవ్ర చర్చనీయాంశమైంది.

Telangana: ఎన్నికల వేళ కాంగ్రెస్‎లో భగ్గు మంటున్న వర్గ పోరు.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే..
Telangana
Follow us on

పార్లమెంట్ ఎన్నికల వేళ వరంగల్ కాంగ్రెస్‎లో గ్రూప్ వర్క్ కాక రేపుతోంది. ఏకంగా రాష్ట్ర మంత్రి.. అధికార పార్టీ ఎమ్మెల్యే మధ్య డైలాగ్స్ వార్ ఆడియో ఆసక్తికర చర్చగా మారింది. ఏం దంకీ ఇస్తున్నావా అని ఎమ్మెల్యే మంత్రిని ప్రశ్నిస్తే.. దమ్కీ కాదు తగ్గేదే లే పరకాలలో నా గ్రూపు నీ గ్రూపు తేల్చుకుందాం అని మంత్రి హెచ్చరించడం కాక రేపుతోంది. పార్టీలో చేరికల విషయంలో వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ కావటం తీవ్ర చర్చనీయాంశమైంది. గీసుకొండ మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రడం భరత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‎ను వీడి బీఆర్ఎస్‎లో చేరారు. గతంలో కొండా దంపతులకు ముఖ్య అనుచరుడిగా ఉన్న భరత్ ఎన్నికల అనంతరం మళ్లీ కొండా సమక్షంలో కాంగ్రెస్‎లో చేరారు. ఆయన చేరిక పట్ల రేవూరి అసంతృప్తితో ఉన్నారు. తనకు తెలియకుండా అతనిని మంత్రి పార్టీలోకి చేర్చుకున్నారని ఆయన్ను దూరం పెట్టారు.

ఈ విషయం తేల్చుకునేందుకు మంత్రి సురేఖ ఎమ్మెల్యే రేవూరికి ఫోన్ చేశారు.’రడం భరత్ అంటే మీకు ప్రాబ్లమా అన్నా.. తమ ఆధ్వర్యంలో అతను కాంగ్రెలో చేరారు. ఎందుకు అతడిని దూరం పెడుతున్నారని ప్రశ్నించారు. తాను మంత్రినని భరత్‎ను అవమానపరిస్తే తనను అవమాన పరిచినట్టే’ అన్నారు కొండా సురేఖ. ‘భరత్ యాటిట్యూడ్ నచ్చటం లేదని సమాధానం ఇచ్చిన రేవూరి మండల నాయకులు కూడా అతడిని వ్యతిరేకిస్తున్నారని సమాధానం ఇచ్చారు. ‘తమ ఆధ్వర్యంలో చేరిన భరత్‎ను మీరెందుకు కలుపు కోవటం లేదని నిలదీయగా.. ‘ఈ విషయాన్ని ముందే తనకు వివరిస్తే బాగుండేది’ అని రేవూరి బదులిచ్చారు. తమ ముఖ్య అనుచరుడని తెలిసి కూడా భరత్‎పై మీరు ఎందుకు కేసు పెట్టించారు. పార్టీకి నష్టం చేసిన బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజ్ కుమార్‎ను పార్టీలో ఎందుకు చేర్చుకోవాలనుకుంటున్నారు.? ఎందుకు వర్గాలు చేస్తున్నారని కొండా సురేఖ రేవూరిని ప్రశ్నించారు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది.. ‘మీరు వర్గాలు చేయాలనుకుంటే నియోజకవర్గం మొత్తంలో మేము కూడా వర్గాలు చేస్తాం’.. మేమేంటో చూపిస్తామని కొండా సురేఖ ఘాటుగా స్పందించారు. ఆ ఫోన్ సంభాషణ ఇప్పుడు ఫుల్ వైరల్ అవుతుంది. గ్రూప్ వార్ నేపథ్యంలోనే గత నాలుగు నెలలుగా రేవూరి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారని సమాచారం. సిఎం రేవంత్ రెడ్డి పర్యటనకు కూడా ఆయన దూరంగా ఉండడం హాట్ టాపిక్‎గా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..