AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంచాయతీ ఎన్నికల వేళ ప్రతి ఛాన్స్ యూజ్ చేసుకుంటున్న లోకల్ లీడర్స్.. ఏం చేశారో తెలుసా?

అసలే ఎన్నికల టైం.. కోతి అంతిమ సంస్కారాలు నిర్వహించిన చోటామోటా నాయకులు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. వరంగల్ నగర శివారు ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై బొల్లికుంట క్రాస్ రోడ్డు వద్ద ఓ కోతి మృతి చెందింది. ఆ మార్గంలో వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొని అపస్మాక స్థితిలోకి వెళ్లింది కోతి.

పంచాయతీ ఎన్నికల వేళ ప్రతి ఛాన్స్ యూజ్ చేసుకుంటున్న లోకల్ లీడర్స్.. ఏం చేశారో తెలుసా?
Monkey Funeral
G Peddeesh Kumar
| Edited By: Balaraju Goud|

Updated on: Dec 03, 2025 | 11:15 AM

Share

అసలే ఎన్నికల టైం.. కోతి అంతిమ సంస్కారాలు నిర్వహించిన చోటామోటా నాయకులు ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. వరంగల్ నగర శివారు ఖమ్మం వరంగల్ ప్రధాన రహదారిపై బొల్లికుంట క్రాస్ రోడ్డు వద్ద ఓ కోతి మృతి చెందింది. ఆ మార్గంలో వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొని అపస్మాక స్థితిలోకి వెళ్లింది కోతి. దానిని కాపాడేందుకు అక్కడున్న వారు విపరీతంగా ప్రయత్నాలు చేశారు. స్థానికంగా కొంతమంది చోటామోటా నాయకులు కూడా వచ్చి ఆ కోతిని కాపాడే ప్రయత్నాలు చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆ కోతి మృతి చెందింది. బాటసారులు స్థానికులు అంతా కలిసి ఆ కోతికి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అసలే ఎన్నికల సమయం కావడంతో అక్కడ కొందరు నాయకులు ఫోటోల కోసం చేసిన కవరింగ్ చూపరులను ఆశ్చర్యపరిచింది.

వరంగల్ సిటీ శివారులో ఈ ఘటన జరిగింది.. రోడ్డు క్రాస్ చేస్తున్న క్రమంలో ఓ వాహనం ఢీ కొని వానరం మృతి చెందింది. ఆ కోతి ప్రాణాలు కాపాడేందుకు అన్ని విధాలుగా ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తు వానరం మృతి చెందింది. ఈ క్రమంలో స్థానికులు మున్సిపల్ జవాన్ ను అక్కడి పిలిపించి ఆ కోతికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.. కోతికి ఖననం చేసి రుణం తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ మార్గంలో వెళ్తున్న బాటసారులు చాలామంది పాల్గొన్నారు.

అయితే ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చోటామోటా నాయకులు ఏ చిన్న అవకాశం కనిపించినా వదులుకోవడం లేదు. అక్కడ హడావుడి చేసి ప్రజల చేత ప్రశంసలు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోటోలకు ఫోజులిచ్చి ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే కొంతమంది చోటామోటా నాయకులు ఆ మార్గంలో వెళ్లేవారు అక్కడ జరుగుతున్న కోతి అంత్యక్రియలు చూసి ఆగారు.

వారు కూడా వానరం అంతిమ సంస్కారాలలో పాల్గొని ఫోటోలకు ఫోజులిస్తూ ప్రజల చేత ప్రశంసలు పొందే ప్రయత్నం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ లోకల్ లీడర్స్ ఫోటోలకు ఫోజులిస్తున్న తీరు చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు..!

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..