AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్.. గోవా వెళ్లడం మరింత సులువు.. ఈ రూట్ ద్వారా కనెక్టివిటీ..

తెలంగాణలో కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. డీపీఆర్‌ను రైల్వే బోర్డకు పంపారు. దీంతో అక్కడ నుంచి అనుమతి లభించాక నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇది పూర్తయితే గోవాకు వేగంగా చేరుకోవచ్చు. అలాగే వికారాబాద్ జల్లా అభివృద్ది ఉపయోగపడనుంది.

Telangana: తెలంగాణలో మరో కొత్త రైల్వే లైన్.. గోవా వెళ్లడం మరింత సులువు.. ఈ రూట్ ద్వారా కనెక్టివిటీ..
Railway Line
Venkatrao Lella
|

Updated on: May 03, 2026 | 12:33 PM

Share

తెలంగాణ ప్రజలకు రైల్వేశాఖ శుభవార్త తెలిపింది. వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్‌ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను రైల్వే బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే అందించింది. దీంతో ఈ ప్రాజెక్టులో మరో ముందడుగు పడినట్లు అయింది. దాదాపు 122 కిలోమీటర్ల మేర ఈ రైల్వే లైన్ ఉండనుండగా.. దీని నిర్మాణానికి రూ.2,844 కోట్లు ఖర్చు అవుతుందని డీపీఆర్ నివేదికలో సమర్పించింది. వికారాబాద్ నుంచి రైల్వే లైన్ ప్రారంభం కానుండగా.. కర్ణాటక సరిహద్దులోని నారాయణపేట జిల్లా కృష్ణా రైల్వే స్టేషన్‌లో ఇది కలుస్తుంది. డీపీఆర్ సిద్దం కావడంతో ఈ ప్రాజెక్టుపై గత కొన్నేళ్లుగా జరుగుతున్న జాప్యానికి తెర పడినట్లయింది.

గోవాకు ప్రయాణం వేగవంతం

ఈ కొత్త రైల్వే లైన్ పూర్తయితే గోవాకు సులువుగా చేరుకోవచ్చు. అత్యంత వేగంగా గోవాకు వెళ్లే అవకాశం ఉంటుంది. గోవా వెళ్లేవారికి ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గంగా ఉండనుంది. వికారాబాద్ నుంచి రాయచూర్, హుబ్లీ మీదుగా గోవాకు వెళ్లవచ్చన్నమాట. ఈ రైల్వే లైన్ పూర్తయిన ఆర్ధిక రాబడి ఎక్కువగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే జోన్ తన నివేదికలో తెలిపింది. రాబడి 10 శాతం కంటే ఎక్కువ ఉన్న రైల్వే లైన్లకు రైల్వేశాఖ ప్రాధాన్యత ఇస్తోంది. ఈ మర్గంలో 10.09 శాతం రాబడి ఉంటుందని రైల్వే అధికారులు అంచనా వేశారు. దీంతో ఈ కొత్త రైల్వే లైన్ నిర్మాణంపై మరో ముందడుగు వేశారు. అయితే ఈ రైల్వే లైన్ కోసం భూసేకరణ ఖర్చు రాష్ట్ర ప్రభుత్వంమే భరించనుంది. దీంతో రైల్వేశాఖ కూడా ఈ ప్రతిపాదనను అంగీకరించి ప్రాజెక్టుపై స్పీడ్ పెంచింది. ప్రస్తుతం రైల్వే బోర్డులోని ప్రాజెక్ట్ ఎవల్యూషన్ కమిటీ వద్ద ఇది పెండింగ్‌లో ఉంది. ఈ రైల్వే లైన్‌కు అవసరమైతన టెక్నికల్, ఆర్ధిక అంశాలను ఆ కమిటీ పరిశీలిస్తోంది.

త్వరలోనే గ్రీన్ సిగ్నల్

రైల్వే బోర్డ్ నుంచి ఆమోదం లభించాక నిర్మాణ పనులు మొదలుకానున్నాయి. డీపీఆర్ పంపించడంలో త్వరలోనే రైల్వే బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తన్నాయి. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే నారాయణపేట, వికారాబాద్ జిల్లాల అభివృద్దికి మేలు చేకూరనుంది. పర్యాటక రంగానికి ఊతమివ్వడంతో పాటు పారిశ్రామికంగా కొత్త పరిశ్రమలు రానున్నాయి. దీంతో ఆర్ధిక పరంగా రెండు జిల్లాలకు ప్రయోజనం చేకూరనుంది.

Follow Us