Jana Ashirwad Yatra: సూర్యాపేటకు చేరుకున్న జన ఆశీర్వాద యాత్ర.. పారిశుద్ధ్య కార్మికురాలు మారతమ్మ ఇంట్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అల్పాహారం..
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. జన ఆశీర్వాద యాత్ర సూర్యాపేటకు చేరుకుంది. స్థానిక చింతల చెరువులో జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలిగా...
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర రెండో రోజు కొనసాగుతోంది. జన ఆశీర్వాద యాత్ర సూర్యాపేటకు చేరుకుంది. స్థానిక చింతల చెరువులో జాతీయ ఉత్తమ పారిశుద్ధ్య కార్మికురాలిగా అవార్డు పొందిన మెరుగు మారతమ్మ ఇంట్లో ఆయన అల్పాహారం చేశారు. అనంతరం ఆమెను సన్మానించారు. సూర్యాపేటలో గాల్వాన్ యుద్ధ వీరుడు మహావీరచక్ర కల్నల్ సంతోష్‌బాబు విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు కిషన్‌రెడ్డి. ఆ తర్వాత రెండో రోజు యాత్రను మొదలు పెట్టారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ప్రజా ఆశీర్వాద యాత్ర అన్నారు.
కరోనాను అరికట్టాలంటే ప్రజల సహకారం కావాలన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు అందిస్తోందని, త్వరలోనే చిన్నారులకు టీకా ఇస్తామన్నారు కేంద్రమంత్రి. కరోనా సమయంలో పేదలను ఆదుకునేందుకు దీపావళి వరకు ఉచిత బియ్యం అందిస్తున్నామని, అవసరమైతే పొడిగిస్తామన్నారు.
దీపావళి వరకు ఇచ్చే ఉచిత బియ్యం పంపిణీని అవసరమైతే మరికొన్ని రోజుల వరకు పొడిగిస్తామన్నారు. కరోనాతో చనిపోయిన జర్నలిస్టులకు రూ.5 లక్షల చొప్పున కేంద్రం సాయం అందిస్తుందన్నారు. కరోనా బారిన పడి చనిపోయిన కుటుంబాలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి విద్యాభ్యాసం అందిస్తామన్నారు.
కరోనా వారియర్స్‌ను ప్రోత్సహించాలిని అన్నారు. కరోనా సమయంలో గాంధీ ఆస్పత్రిని తొమ్మిది సార్లు పరిశీలించానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి: తాలిబన్లకు ఆ ప్రదేశం అంటే వణుకు.. కనీసం కన్నువేయడానికి కూడా వణికిపోతుంటారు.. ఎందుకో తెలుసా..
నల్లబంగారం ఎలా తయారు చేస్తారు.. గుర్తిపు పత్రం నుండి మార్కెట్ వరకు ప్రతిదీ తెలుసుకోండి..