Kishan Reddy – KCR: సీఎం సారు.. వీటి సంగతేంటి.. కేసీఆర్‌కు మరోసారి లేఖాస్త్రాన్ని సంధించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

తెలంగాణలో లేఖల రాజకీయం జోరు తగ్గట్లేదు. కొద్దిరోజులుగా భారతీయ జనతా పార్టీ-టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ ఫైర్ జోరందుకోవడంతో.. ఇరు పార్టీలకు చెందిన నేతలు లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు.

Kishan Reddy - KCR: సీఎం సారు.. వీటి సంగతేంటి.. కేసీఆర్‌కు మరోసారి లేఖాస్త్రాన్ని సంధించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
Kishan Reddy Kcr
Follow us

|

Updated on: Feb 21, 2022 | 7:03 AM

Minister Kishan Reddy urges CM KCR: తెలంగాణ(Telangana)లో లేఖల రాజకీయం జోరు తగ్గట్లేదు. కొద్దిరోజులుగా భారతీయ జనతా పార్టీ(BJP)-టీఆర్ఎస్(TRS) మధ్య పొలిటికల్ ఫైట్ జోరందుకోవడంతో.. ఇరు పార్టీలకు చెందిన నేతలు లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు. తాజాగా మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రానికి రావల్సి నిధులు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందంటూ తెలంగాణ ప్రభుత్వం మండిపడుతుంటే.. ఇచ్చిన నిధులను ఏం చేశారో చెప్పాలంటూ కేంద్ర సర్కార్ వివరణ లేఖలతో రాజకీయ యుద్ధం ప్రకటిస్తోంది.

కొన్నాళ్లుగా తెలంగాణలో గులాబీ వర్సెస్‌ కమలం వార్‌ నడుస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఒకరిపై ఒకరు లేఖాస్త్రాలు సంధించుకున్నారు. కేంద్రంపై తెలంగాణ మంత్రులు, తెలంగాణ సర్కార్‌పై కేంద్ర మంత్రులు లెటర్‌ వార్‌ ప్రకటించారు. తాజాగా మరో కీలక అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. 2022-23 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు సమర్పించిన బడ్జెట్‌లో, తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి రూ.3వేల 48కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రైల్వే పనుల కోసం 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల 420 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, వచ్చే ఆర్థిక సంవత్సంలో కేటాయింపులను 25 పెంచినట్లు వెల్లడించారు. అలాగే, 2014-20 మధ్య కాలంలో కేటాయించిన సగటు వార్షిక రైల్వే బడ్జెట్ కంటే 3 రెట్లు అధికంగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు చేశారని చెప్పారు కిషన్‌రెడ్డి. బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులకు సంబంధించిన వివరాలను ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు కేంద్రమంత్రి.

తెలంగాణ వ్యాప్తంగా 1300 కిలోమీటర్లకు పైగా రైల్వే పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఈ సమస్యలపై చొరవ తీసుకుని వెంటనే పరిష్కరించాలని కోరారు కిషన్‌రెడ్డి. తెలంగాణ ప్రజలకు రైల్వేలను మరింత చేరువ చేయడానికి సహకరించాలని కోరుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైల్వేల ఆధునికీకరణలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాల చేపడుతున్నట్లు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అటు తెలంగాణలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, డబ్లింగ్ లైన్ల నిర్మాణం, అవసరమున్న చోట మూడో లైన్ నిర్మాణం, రైల్వే లైన్ల విద్యుద్దీకరణ, రైల్వే రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు.

Read Also…

CM KCR: నేడు నారాయణఖేడ్‌లో సీఎం కేసీఆర్ పర్యటన.. కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..