AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Liberation Day: తెలంగాణ పోరాట యోధులను రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయిందిః కిషన్ రెడ్డి

తెలంగాణ చరిత్రలో ఎన్నో విషాద గాథలను లిఖించింది. నిజాం పాలనలో దేశ్‌ముఖ్‌లు, దొరలు, జాగీర్దార్లు అమాయక ప్రజలను చెరబట్టారు. అణచివేతకు గురైన వేలాది మంది ప్రజల విరోచిత పోరాటం ఫలితంగా నిజాం పాలన నుంచి తెలంగాణకు విమోచనం కలిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Telangana Liberation Day: తెలంగాణ పోరాట యోధులను రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయిందిః కిషన్ రెడ్డి
Telangana Liberation Day Celebrationa
Balaraju Goud
|

Updated on: Sep 17, 2024 | 12:35 PM

Share

తెలంగాణ చరిత్రలో ఎన్నో విషాద గాథలను లిఖించింది. నిజాం పాలనలో దేశ్‌ముఖ్‌లు, దొరలు, జాగీర్దార్లు అమాయక ప్రజలను చెరబట్టారు. అణచివేతకు గురైన వేలాది మంది ప్రజల విరోచిత పోరాటం ఫలితంగా నిజాం పాలన నుంచి తెలంగాణకు విమోచనం కలిగిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన కిషన్ రెడ్ది తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనేక బలిదానాలు, ఎందరో త్యాగాల అనంతరం తెలంగాణకు స్వాతంత్య్రం సిద్ధించిందని, నిజాం రాజాకార్ల మెడలు వంచి తెలంగాణ సాధించడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర సాహసోపేతమైన నిర్ణయం అని కేంద్ర మంత్రి గుర్తుచేశారు.

దేశానికి ఆగస్ట్ 15 ఎలాగో.. తెలంగాణకు సెప్టెంబర్ 17 కూడా అలాగే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు నిజాం నుంచి విముక్తి లభించిన రోజును, తెలంగాణ పోరాట యోధులను రాష్ట్ర ప్రభుత్వాలు మర్చిపోయాయన్నారు. స్వార్థ, ఫిరాయింపు రాజకీయాలను తిప్పికొడదామని పిలుపునిచ్చిన కిషన్ రెడ్డి. బలమైన పునాదుల తెలంగాణను నిర్మించుకుందామన్నారు. తెలంగాణ చరిత్ర సుసంపన్నమైనదని, అద్భుతమైన పోరాటాలు, అసమాన త్యాగాలు, నిరుపమైన సేవలు దాగి ఉన్నాయన్నారు. గుండె తరుక్కుపోయే దారుణాలు ఉన్నాయన్నారు. తెలంగాణ చరిత్రను ఈ ప్రభుత్వాలు గుర్తించడం లేదని ఆందోళన వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి, రాష్ట్ర చరిత్రను ముందు తరాలకు తెలియజేసే బాధ్యత యువతదే అన్నారు.

1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. కానీ, నిజాం సంస్థానంలోని ప్రజలకు మాత్రం స్వాతంత్ర్యం రాలేదని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. దేశమంతటా ఆనందంతోత్సాహాలతో సంబరాలు జరుగుతున్నాయి. కానీ ఒక్క నిజాం సంస్థానంలో తప్పా. నిజాం నిరంకుశ పాలనకు ఘోరీ కట్టాలని ప్రజలు సిద్ధమైన తర్వాత.. సర్దార్‌‌ వల్లభ్‌ భాయ్‌ పటేల్‌‌ సైన్యం హైదరాబాద్‌లోకి ప్రవేశించడం, నిజాం లొంగిపోవడంతో.. హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందని మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు. భూస్వామ్య వ్యవస్థ చెర నుంచి ఊపిరి పీల్చుకున్న రోజు.. ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న రోజు. రాచరికపు వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య పాలనవైపు అడుగులు పడినరోజు. అంత ప్రాధాన్యత ఉంది కాబట్టే విమోచన దినోత్సవం జరపాలనేది బీజేపీ నేతల మాట అని కిషన్ రెడ్డి తెలిపారు. అందుకే ప్రస్తుతం కేంద్రమే అధికారికంగా విమోచన దినోత్సవం నిర్వహిస్తోందని స్పష్టం చేశారు.

తెలంగాణ చరిత్రలో ఎన్నో విషాద గాథలను లిఖించింది. నిజాం పాలనలో దేశ్‌ముఖ్‌లు, దొరలు, జాగీర్దార్లు అమాయక ప్రజలను చెరబట్టారు. పల్లెల్లో మహిళల బట్టలిప్పి బతుకమ్మ ఆడించారు. అంతటి అరాచకాన్ని ఎదుర్కోవడానికి మట్టి మనుషులు యుద్ధం చేశారు. ఎందరో త్యాగధనుల పోరాటంతో తెలంగాణకు విముక్తి కలిగింది. సెప్టెంబర్ 17ని కొందరు విలీన దినంగా, మరికొందరు విమోచన దినంగా పాటిస్తుంటే.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం.. ఇవేవీ కాకుండా సమైక్యత దినోత్సవంగా ప్రకటించింది. రాచరిక వ్యవస్థ నుంచి తెలంగాణ సమాజం ప్రజాస్వామిక వ్యవస్థలోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా సెప్టెంబర్ 17ను తెలంగాణ జాతీయ సమైక్యతా దినంగా పాటించాలని నిర్ణయించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. 2022లో మూడు రోజులపాటు తెలంగాణ వ్యాప్తంగా వేడుకలు జరిపింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పాత గాయాల జోలికి గానీ.. విద్వేషాలు సృష్టించడానికి గానీ సిద్ధంగా లేదు. అందుకే, ప్రజాపాలనా దినోత్సవంగా జరుపుతోంది. కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించినట్లుగానే విమోచన దినోత్సవం పేరుతో ఈసారి కూడా గ్రాండ్‌గా నిర్వహిస్తోంది. వామపక్ష పార్టీలు ఏ పేరు పెట్టకుండా సెప్టెంబర్ 17న వేడుకలు, ర్యాలీలు, ఫొటో ఎగ్జిబిషన్ రూపంలో నిర్వహించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..