Amit Shah: Amit Shah: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. ఆ జిల్లాలో కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశానికి భారీ ఏర్పాట్లు..

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 28న తెలంగాణలో పర్యటించనున్నారు. లోక్‌సభ ప్రవాస్ ప్రచారాని ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రారంభించనున్నారని బీజేపీ ఎంపీ సోయంం బాపు రావు తెలిపారు.

Amit Shah: Amit Shah: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. ఆ జిల్లాలో కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశానికి భారీ ఏర్పాట్లు..
Central Home Minister Amit Shah To Come Telangana

Edited By:

Updated on: Jan 21, 2023 | 9:06 PM

తెలంగాణపై కమలనాథులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అధికారమే టార్గెట్‌గా దూసుకుపోతున్నారు. కార్యాచరణకు పదును పెడుతున్నారు. ఇప్పటికే ఉత్తర భారత దేశంలో పూర్తి పట్టు సాధించిన భారతీయ జనతా పార్టీ .. ఇప్పుడు దక్షిణ భారతాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలనే దిశగా భారీ స్కెచ్‌తో ముందుకు సాగుతున్నారు. ఆ నేపథ్యంలోనే తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది బీజేపీ అధిష్టానం. ఈ కారణంగానే తరచూ తెలంగాణకు వస్తున్నారు ఆ పార్టీ అగ్రనేతలు. ఒకవైపు పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేస్తూనే మరో వైపు ప్రజా శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రత్యేక కార్యక్రమాలను యోజన చేస్తున్నారు.

ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఆయన రూ. 7 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. ఆయన పర్యటన ముగిసిన కొద్ది రోజులకే కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా తెలంగాణకు రానున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నెల 28న తెలంగాణలో పర్యటించనున్నారని ఆ పార్టీ ఎంపీ సోయం బాపురావు తెలిపారు. పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా ఈనెల 28 న ఆదిలాబాద్ కు అమిత్ షా  ఆదిలాబాద్‌లో పర్యటించనున్నారు. ఇందు కోసం ఆదిలాబాద్ నగరంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడించారు. తమ ఆదిలాబాద్ నుంచి పార్లమెంట్ ప్రవాస్ యోజన ప్రారంభంపై ఎంపీ సోయం బాపు రావు హర్షం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పదికి పది స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో తాము పక్కా ఫ్లాన్‌తో ముందుకు వెళుతున్నామన్నారు ఎంపి సోయం బాపురావు.

అమిత్ షా పర్యటనలో భాగంగా రాష్ట్రంలోని 17 లోక్‌సభలు, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్ కమిటీలు, మండల, ఇతర స్థాయి కమిటీల నియామకంపై సమీక్షిస్తారు.

ఇక, గత ఏడాది డిసెంబర్ చివరలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా.. పార్టీ లోక్‌సభ ప్రవాస్ ప్రచారానికి సంబంధించిన 2.0ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం పార్టీ బలహీనంగా ఉన్న లోక్‌సభ స్థానాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం