AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీరనున్న యూరియా కష్టాలు.. 5 ఓడల్లో 80 వేల మెట్రిక్ టన్నుల లోడ్‌ వచ్చేస్తోందీ!

తెలంగాణ రైతుల అవసరాలకు సరిపడా యూరియాను వీలైనంత త్వరగా కేటాయించి, పంపిణీ అయ్యేలా చూడాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణలో సాగులో ఉన్న ప్రధాన పంటలు.. వరి, మొక్కజొన్న, పత్తికి యూరియా ఎంతో అవసరమని ఈ పది, పదిహేను రోజులు అత్యంత కీలకమైనందున..

తీరనున్న యూరియా కష్టాలు.. 5 ఓడల్లో 80 వేల మెట్రిక్ టన్నుల లోడ్‌ వచ్చేస్తోందీ!
Urea For Telangana Farmers
Srilakshmi C
|

Updated on: Sep 15, 2025 | 8:47 PM

Share

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15: తెలంగాణ రైతులకు సరిపడా యూరియాను పది రోజుల్లోనే సరఫరా చేయాలని.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాను కోరారు. తెలంగాణ రైతుల అవసరాలకు సరిపడా యూరియాను వీలైనంత త్వరగా కేటాయించి, పంపిణీ అయ్యేలా చూడాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణలో సాగులో ఉన్న ప్రధాన పంటలు.. వరి, మొక్కజొన్న, పత్తికి యూరియా ఎంతో అవసరమని ఈ పది, పదిహేను రోజులు అత్యంత కీలకమైనందున.. తెలంగాణ రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియా సరఫరా చేయాలని కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శిని కోరారు.

అలాగే అంతకు ముందు నెలల్లో ఏర్పడిన యూరియా లోటును పూడ్చే విధంగా ఈ నెలలో 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని కోరారు.. సెప్టెంబర్ నెలలో ఇప్పటివరకు లక్షా 4 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి సరఫరా జరిగింది.. రానున్న 10 రోజుల్లో మరో లక్ష మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలని కోరగా.. దేశీయ యూరియా ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేని నేపథ్యంలో.. విదేశాల నుంచి దిగుమతయ్యే యూరియాలో తెలంగాణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని రజత్ కుమార్ మిశ్రా తెలిపారు.. 40 వేల మెట్రిక్ టన్నుల యూరియాను తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇచ్చిన ప్రణాళిక ప్రకారం ఈ వారంలో సరఫరా అయ్యే 40 వేల మెట్రిక్ టన్నులకు ఇది అదనం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

వివిధ పోర్టులకు ఓడల ద్వారా వచ్చిన యూరియాలో తెలంగాణకు కేటాయింపులు ఇలా..

  • మంగళూరు, ఎంవీ రెక్ గ్రేస్-2700 టన్నులు
  • కాకినాడ, ఎంవీ జీఎన్ రూబి-8100 టన్నులు
  • కాకినాడ, ఎంవీ గ్రేస్ ఆర్మోనీ- 7800 టన్నులు
  • కృష్ణపట్నం, ఎంవీ ఎన్డీవర్-13000 టన్నులు
  • జైగఢ్, ఎంవీ వాడి అల్బోస్టాన్-8100 టన్నులు

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
అతి త్వరలో వీళ్ళు మొత్తాన్ని ఏలేస్తారు.. మీరున్నారా?
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
జూన్ 14 రాశిఫలాలు: ఆ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం దిశగా.. హోర్ముజ్ జలసంధి..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
మంత్రం జపించేటప్పుడు అక్షర దోషం వస్తే పాపమా? శాస్త్రం ఏమి చెబు..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఈ నక్షత్రంలో జన్మించిన వారిని ఓడించడం కష్టం.. మీ నక్షత్రం కూడా..
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఇంట్లో గజ్జెల చప్పుడు వినిపిస్తుందా? అమ్మవారి అనుగ్రహానికి ఇది సం
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
ఆదివారం సూర్యారాధన ఎందుకు చేయాలి? 99% మందికి తెలియని ఆధ్యాత్మిక..
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
శ్మశానం దగ్గర అనుమానాస్పదంగా ముగ్గురు.. పోలీసలు వచ్చి చూడగా
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు
అన్ని దరిద్రాలను తరిమికొట్టే అమావాస్య..ఇలా చేస్తే మీకు తిరుగులేదు