
పైన పేర్కొన్న ఫోటోను చూశారా.? అతడొక గొర్రెలు కాపరి. హీరో అవ్వడానికి ట్రై చేశాడు. తీరా చివరికి గొర్రె అయ్యాడు. వీడు చెప్పిన కథకు ఓ ఖతర్నాక్ సినిమా కూడా తీయొచ్చు. లేదంటే ఓ వెయ్యి ఎపిసోడ్ల సీరియల్ తీయొచ్చు. అసలు కథేంటంటే.. ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో గొర్రెలు కాసే ఈ హీరోనే.. అసలైన విలన్. అదేంటని ఆలోచిస్తున్నారా.? ఆ ట్విస్టు పోలీసుల ఎంక్వైరీలో తేలింది. అప్పుడు పోలీసులకే కాదు.. ఊరి జనాలకు కూడా దెబ్బకు మైండ్ బ్లాంక్ అయ్యింది.
వివరాల్లోకి వెళ్తే.. నాగర్‌కర్నూలు జిల్లాలోని పెంట్లవెల్లి మండలం సింగవరంలో గొర్రెల కాపరి కర్ణికం మల్లయ్య కిడ్నాప్ కేసులో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. బన్నెల రాముడు, వారి కుటుంబ సభ్యులు పదేపదే తనపై దాడి చేస్తున్నారని.. వారిని ఇబ్బంది పెట్టాలని కోపంతో సదరు గొర్రెల కాపరి ఈ కిడ్నాప్ డ్రామాకు తెరలేపాడని పోలీసుల విచారణలో తేలింది. తన అన్నతో కలిసి కర్ణికం మల్లయ్య ఈ కిడ్నాప్ ప్లాన్ వేశాడు. అన్నతోనే తాళ్లతో కట్టించుకుని గుర్తుతెలియని వ్యక్తులు బంధించారని అందరిని తప్పుదోవ పట్టించాడు. ఇక ఎంక్వయిరీలో తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని.. తామే ఇలా చేశామని పోలీసులు ముందు ఒప్పుకున్నాడు కర్ణికం మలయ్య.
ఇది చదవండి: ఆరుగురు వ్యక్తులు, మూడు కార్లు.. ORRపై దూసుకొస్తున్న కాన్వాయ్.. డౌట్ వచ్చి ఆపి చూడగా
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి