KTR: కేటీఆర్‌కు వెరైటీగా బర్త్‌డే విషెస్‌.. మంత్రిపై అభిమాన్ని ఎలా చాటుకున్నారో చూడండి.

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీఎస్‌టీఎస్‌ ఛైర్మన్‌ జగన్మోహన్ వినూత్న పద్ధతిలో కేటీఆర్‌ బర్త్‌డే వేడుకలను నిర్వహించారు. కూకట్‌పల్లిలోని తన ఆఫీసులో ఆదివారం వేడుకలను నిర్వహించారు. 18000 నోట్‌ బుక్స్‌తో కేటీఆర్‌ చిత్ర పటాన్ని...

KTR: కేటీఆర్‌కు వెరైటీగా బర్త్‌డే విషెస్‌.. మంత్రిపై అభిమాన్ని ఎలా చాటుకున్నారో చూడండి.
Minister KTR

Edited By: Ram Naramaneni

Updated on: Jul 24, 2023 | 7:17 AM

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీఎస్‌టీఎస్‌ ఛైర్మన్‌ జగన్మోహన్ వినూత్న పద్ధతిలో కేటీఆర్‌ బర్త్‌డే వేడుకలను నిర్వహించారు. కూకట్‌పల్లిలోని తన ఆఫీసులో ఆదివారం వేడుకలను నిర్వహించారు. 18000 నోట్‌ బుక్స్‌తో కేటీఆర్‌ చిత్ర పటాన్ని చిత్రీకరించారు. మోసాయక్‌ ఆర్ట్ చిత్రీకరించి జగన్మోహన్‌తో పాటు ఆయన టీం సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా జగన్మోహన్‌ మాట్లాడుతూ.. కేటీఆర్‌ పుట్టనరోజును పురస్కరించుకొని గిఫ్ట్‌ ఏ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా 18,000 నోట్‌ బుక్స్‌ను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నోట్‌ బుక్స్‌తో కేటీఆర్‌ రూపాన్ని చిత్రీకరించిన విధానంగా అందరినీ ఆకట్టుకుంటోంది. డ్రోన్‌ సహాయంతో వీడియోను చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

రెండు రోజులు శ్రమించి జగన్మోహన్‌ బృందం ఈ మోసాయక్‌ చిత్రాన్ని రూపొందించారు. తెలంగాణలో ఇప్పటి వరకు రూపొందించిన అతిపెద్ద మోసాయక్‌ చిత్రం ఇదేనని చెబుతున్నారు. ఆ చిత్రాన్ని చూడడానికి కూకట్‌పల్లి ప్రాంతానికి చెందిన పలువురు సీనియర్‌ బీఆర్‌ఎస్‌ నాయకులు, యువజన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..