Telangana RTC: ఆర్టీసీ ప్రయాణికులకు మరో షాక్.. మరోసారి తప్పని టికెట్ చార్జీల బాదుడు!

|

Jun 08, 2022 | 9:48 PM

ధరాఘాతంలో అల్లాడుతున్న సామాన్యుడిపై ఆర్టీసీ రూపంలో మరో పిడుగు పడే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెరగనున్నట్లు తెలుస్తోంది. కిలోమీటర్‌ వారీగా..

Telangana RTC: ఆర్టీసీ ప్రయాణికులకు మరో షాక్.. మరోసారి తప్పని టికెట్ చార్జీల బాదుడు!
Tsrtc
Follow us on

మార్కెట్లో నిత్యవసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ రేట్ల మోత మోగుతోంది. ఇక కూరగాయలైతే  కొనేటట్టు లేదు. వంటనూనెల ధరలు చుక్కలనంటుతున్నాయి. చికెన్ రేట్లు కొండెక్కాయి. ధరాఘాతంలో అల్లాడుతున్న సామాన్యుడిపై ఆర్టీసీ రూపంలో మరో పిడుగు పడే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెరగనున్నట్లు తెలుస్తోంది. కిలోమీటర్‌ వారీగా డీజిల్‌ సెస్‌ విధించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. దీంతో మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

గతంలో రౌండప్‌, టోల్‌ ప్లాజాలు, ప్యాసింజర్స్‌ సెస్‌ పేరిట ఒకసారి ఛార్జీలు పెంచిన ఆర్టీసీ మరోసారి ఏప్రిల్‌లో డీజిల్‌ సెస్‌ పేరుతో ప్రయాణికులపై భారం మోపింది. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి డీజిల్‌ సెస్‌ కింద రెండు రూపాయలు, ఎక్స్‌ ప్రెస్, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌, మెట్రో డీలక్స్‌, ఏసీ సర్వీసులలో ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ.5 చొప్పున పెంచిన విషయం తెలిసిందే. నష్టాల ఊబి నుంచి కొంతైనా బయటపడేందుకుగాను ‘డీజిల్‌ సెస్‌‘ విధించాలని టీఆఎస్‌ఆర్టీసీ భావించింది. వాస్తవానికి గత కొన్నేళ్లుగా ఆర్టీసీ నష్టాల్లో ఉంది. దీనికితోడు కరోనా కల్లోలం సృష్టించడంతో సంస్థ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది.

ఇవి కూడా చదవండి