తెలంగాణ రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 పోస్టులకు టీఎస్పీయస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ గతేడాది డిసెంబర్ 30 నుంచి జనవరి 19వ తేదీ వరకు స్వీకరించింది. గ్రూప్ 4 పోస్టులకు వచ్చిన దరఖాస్తుల్లో తప్పులు సవరించుకునేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అవకాశం కల్పించింది. అభ్యర్థులు మే 9 నుంచి 15 వరకు ఎడిట్ ఆప్షన్ ఉపయోగించుకోవచ్చని వెల్లడించింది. దరఖాస్తుల్లో తప్పులను సవరించుకునేందుకు మరోసారి అవకాశం ఉండదని.. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవల్సిందిగా టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది.
కాగా మొత్తం 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు రాష్ట్ర వ్యాప్తంగా 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తీవ్రమైన పోటీ నెలకొనడంతో స్థానికతతోపాటు విద్యార్హతలు, కులధృవీకరణ వంటి పలు అంశాలు నియామక ప్రక్రియలో కీలకం కానున్నాయి. అందువల్ల దరఖాస్తు సమయంలో దొర్లిన తప్పులను సరిచేసుకునేందుకు తాజాగా కమిషన్ అవకాశం ఇచ్చింది. కాగా టీఎస్పీయస్సీ గ్రూప్ 4 పరీక్ష జులై 1న జరగనుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.