TS Weather Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రమై ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం మీద ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీనికి అనుబంధంగా గాలులతో ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించింది. అల్పపీడనం బలపడి.. వాయుగుండంగా మారే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ పేర్కొంది. ఇది ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా క్రమంగా పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని వివరించింది. రుతుపవనాల ద్రోణి ప్రభావంతో నేడు, రేపు రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
తెలంగాణలోని ఉత్తర జిల్లాలకు ఆగస్టు 8 , 9 తేదీల్లో ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లు జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ చాలా భారీ వర్షపాతాన్ని సూచిస్తుందియు రెడ్ అలర్ట్ అత్యంత భారీ వర్షపాతాన్ని సూచిస్తుంది. ఒడిశా-పశ్చిమ బంగాళాఖాతంలో వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని IMD తెలిపింది.
కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్ (రూరల్), వరంగల్ (అర్బన్), జనగాం, సిద్దిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఈరోజు రెడ్ అలర్ట్ ప్రకటించారు. కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్ (రూరల్), వరంగల్ (అర్బన్) జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
ఆగస్టు 9న ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో రెడ్ అలర్ట్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, రాజన్న-సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. కామారెడ్డి, వరంగల్ (రూరల్), వరంగల్ (అర్బన్), జనగాం జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
హైదరాబాద్‌లో.. రెండు రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గత 24 గంటలుగా హైదరాబాద్ సహా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భాగ్యనగర వాసులు తడిసి ముద్దయ్యారు. రహదారులు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కోఠి, అబిడ్స్, అమీర్ పెట్, పంజాగుట్ట, దిల్ షుఖ్ నగర్, నారాయణగూడ, ఖైరతాబాద్, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో తెల్లవారు జామునుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..