నిర్మలా సీతారామన్ కు కేటీఆర్ లేఖ
తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్.. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. పట్టణ, స్థానిక సంస్థలకు నిధుల విడుదల విషయమై కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు..

తెలంగాణ పురపాలకశాఖ మంత్రి కేటీఆర్.. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు లేఖ రాశారు. పట్టణ, స్థానిక సంస్థలకు నిధుల విడుదల విషయమై కేటీఆర్ తన లేఖలో పేర్కొన్నారు. 15వ ఆర్థిక సంఘం మిలియన్ ప్లస్ నగరమైన హైదరాబాద్ కు రూ.468 కోట్లు, నాన్-మిలియన్ ప్లస్ నగరాలకు రూ.421 కోట్లు సిఫారసు చేసిన విషయాన్ని లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు. అయితే మిలియన్ ప్లస్ నగరాలకు నిధులు ఇంకా విడుదల కాలేదని, నాన్ మిలియన్ ప్లస్ నగరాలకు నిధుల విడుదల కూడా నాలుగు దఫాలుగా విడుదల చేసేందుకు నిర్ణయించారని కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలో తొలి విడతగా మే 19 న రూ.105.25 కోట్లు విడుదల చేశారని కేటీఆర్ వివరించారు. 14వ ఆర్థిక సంఘం తెలంగాణ పట్టణ స్థానిక సంస్థలకు కేటాయించిన నిధుల్లోనూ ఇలాంటి పరిస్థితే ఏర్పడిందని.. ఈ అంశంపై సత్వర చర్యలు తీసుకుని సకాలంలో నిధులు విడుదలయ్యేందుకు సహకరించాలని కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు.
MA&UD Minister @KTRTRS wrote a letter to Hon’ble @FinMinIndia Smt @nsitharamanoffc requesting release of pending grants to Urban Local Bodies in Telangana. pic.twitter.com/lpothGpriL
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) September 19, 2020