Telangana: అయ్యో.. ఎంత ఘోరం! ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలై ఆరుగురు, ఫెయిలవుతాననే భయంతో మరొకరు..

|

Apr 25, 2024 | 11:01 AM

తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు బుధవారం విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామనే మనస్తాపంతో కేవలం ఒక్కరోజులోనే ఆరుగురు ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరొక విద్యార్ధిని ఫెయిలవుతాననే భయంతో ఇంకొక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో విద్యార్ధుల కుటుంబాల్లో అంతులేని విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

Telangana: అయ్యో.. ఎంత ఘోరం! ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిలై ఆరుగురు, ఫెయిలవుతాననే భయంతో మరొకరు..
Inter Students Suicide
Follow us on

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు బుధవారం విడుదలైన సంగతి తెలిసిందే. పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యామనే మనస్తాపంతో కేవలం ఒక్కరోజులోనే ఆరుగురు ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరొక విద్యార్ధిని ఫెయిలవుతాననే భయంతో ఇంకొక విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో విద్యార్ధుల కుటుంబాల్లో అంతులేని విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూర్‌కు చెందిన సాయితేజ గౌడ్‌ (17) అనే విద్యార్ధి, హైదరాబాద్‌ అత్తాపూర్‌కు చెందిన హరిణి అనే విద్యార్ధిని, మంచిర్యాల జిల్లా తాండూర్‌ మండలం అచ్చులాపూర్‌ గ్రామానికి చెందిన మైదం సాత్విక్, మంచిర్యాల జిల్లా దొరగారిపల్లెకు చెందిన గట్టిక తేజస్విని, ఖమ్మం జిల్లా ముదిగొండకు చెందిన వాగదాని వైశాలి, మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం చిలుకోడు గ్రామానికి చెందిన చిప్పా భార్గవి.. వారి వారి ఇళ్లలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం పతూరు గ్రామానికి చెందిన శ్రీజ ఒకేషనల్‌ ఫస్టియర్‌ పరీక్షలు రాసింది. నిన్న వచ్చన ఫలితాల్లో ఫెయిల్‌ అవుతానేమోనని, ఫెయిల్‌ అయితే అందరి ముందు అవమానం ఎదుర్కోవాల్సి వస్తుందేమోననే భయంతో ఫలితాలకు మందు రోజు.. అంటే మంగళవారం రాత్రి పురుగుల మందు తాగింది. దీంతో వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు శ్రీజను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. బుధవారం వచ్చని పరీక్ష ఫలితాల్లో శ్రీజ పాసైనట్లు వచ్చింది. దీంతో శ్రీజ తల్లిదండ్రులు బిడ్డను పట్టుకుని కన్నీరుమున్నీరుగా విలిపించారు. ఆయా విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.