Government Vs Governor: గవర్నర్‌తో పెరుగుతున్న గ్యాప్.. తెలంగాణ కేబినెట్ విస్తర‌ణ‌ ఇప్పట్లో లేనట్లేనా..?

TS Cabinet Expansion: అంధ్ర‌ప్ర‌దేశ్‌లో క్యాబినెట్ విస్త‌ర‌ణ జ‌రిగింది. తెలంగాణ‌లో కూడా క్యాబినెట్‌లో ఓక బెర్త్ కాలీగా ఉంది. కొత్త‌వారికి ఇక్క‌డ కూడా అవ‌కాశం ఉంటుందని అంతా భావిస్తున్నా... తాజా ప‌రిణామాలు వారి ఆశ‌ల‌కు బ్రేక్ వేస్తున్నాయి. మంత్రుల‌కు..

Government Vs Governor: గవర్నర్‌తో పెరుగుతున్న గ్యాప్.. తెలంగాణ కేబినెట్ విస్తర‌ణ‌ ఇప్పట్లో లేనట్లేనా..?
Ts Cabinet Reshuffle
Follow us
Rakesh Reddy Ch

| Edited By: Sanjay Kasula

Updated on: Apr 13, 2022 | 2:13 PM

అంధ్ర‌ప్ర‌దేశ్‌లో క్యాబినెట్ విస్త‌ర‌ణ జ‌రిగింది. తెలంగాణ‌లో కూడా క్యాబినెట్‌లో(Telangana Government ) ఓక బెర్త్ కాలీగా ఉంది. కొత్త‌వారికి ఇక్క‌డ కూడా అవ‌కాశం ఉంటుందని అంతా భావిస్తున్నా… తాజా ప‌రిణామాలు వారి ఆశ‌ల‌కు బ్రేక్ వేస్తున్నాయి. మంత్రుల‌కు ప్ర‌మాణం స్వీకారం చేయించాల్సిన వ్య‌క్తి ఇప్పుడు మంత్రివ‌ర్గానికి అడ్డుగా మారార‌నే టాక్ న‌డుస్తుంది. ఇక తెలంగాణ‌లో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ మ‌టే ఉండ‌దని గ‌ట్టిగానే చెబుతున్నారు కొంత‌మంది నేత‌లు. ఈటెల రాజేంద‌ర్ పార్టి వీడిన త‌ర్వాత అ ఒక్క‌స్థానంపై చాలామంది ఆశ‌లు పెట్టుకున్నారు. దీనితో పాటు సామాజిక స‌మీక‌ర‌ణాలు, మారీన రాజ‌కీయ పరిస్థితుల‌కు అనుకూలంగా మంత్రివ‌ర్గంలో మార్పులు ఉంటాయని కూడా అంతా భావించారు. జాతీయ రాజ‌కీయాలు, వ‌చ్చే ఎన్నిక‌లు దృష్టిలో పెట్టుకుని క్యాబినెట్‌లో కొత్త ముఖాల‌కు అవ‌కాశం అని అనుకున్నారు. కాని తాజాగా గ‌వ‌ర్న‌మెంట్ వ‌ర్సెర్ గ‌వర్న‌ర్‌ విభేదాలు క్యాబినెట్ విస్త‌ర‌ణ‌కు అడ్డుగామారాయి.

గ‌త కొద్ది కాలంగా గ‌వ‌ర్న‌ర్ కార్య‌క్ర‌మాల‌కు ప్ర‌భుత్వ పెద్ద‌లు హ‌జ‌రుకావ‌డంలేదు. పైగా ఇద్ద‌రి మ‌ధ్య బ‌హిరంగంగానే మాట‌ల యుద్దం న‌డుస్తుంది. ముఖ్య‌మైన గ‌వ‌ర్న‌ర్ కార్య‌క్ర‌మాలకు కూడా టిఅర్ఎస్ నేత‌లెవ‌రు కూడా హ‌జ‌రుకావ‌డంలేదు. సిఎం కెసిఅర్ కూడా గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసేందుకు సుముఖంగా లేరు. కౌషిక్ రెడ్డి ఎమ్మెల్సి సిఫార‌సు నుంచి మెద‌లైన గ్యాప్ ఢిల్లిలో గ‌వ‌ర్న‌ర్ చేసిన వ్యాఖ్య‌ల‌తో తారాస్థాయికి చేరింది. ప్ర‌భుత్వం కూడా అధికారిక కార్య‌క్ర‌మాల‌కు గ‌వ‌ర్న‌ర్‌ను పిల‌వ‌డంలేదు. మెడారం జాత‌ర‌,యాదాద్రి, భ‌ద్రాచ‌లం ఉత్స‌వాల‌కు కూడా అధికారిక పిలుపులేదు. క‌నీసం గ‌వ‌ర్నర్‌ను జిల్లా అధికారులు కూడా స్వాగ‌తం ప‌ల‌క‌డంలేద‌నే అరోప‌ణలున్నాయి. జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్న గ‌వ‌ర్న‌ర్ అ జిల్లా మంత్రులు కూడా మ‌ర్యాద‌పూర్వకంగా క‌ల‌వ‌డంలేదు.

గ‌వ‌ర్న‌ర్‌తో ఇంత గ్యాప్ ఉన్న ఈ స‌మయంలో మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణకు సిఎం రాజ్‌భ‌వ‌న్‌కు వెళ‌తారా…? గ‌వ‌ర్న‌ర్‌తో క‌లిసి వేదిక పంచుకుని ప్ర‌మాణ స్వికారంలో పాల్గొంటారా..? అనే అనుమానాలు మెద‌ల‌య్యాయి. కెసిఅర్‌తో చాలా చ‌నువుగా, అత్యంత స‌న్నిహితంగా ఉంటే నేత‌లు మాత్రం అయ‌న క్యాబినెట్ విస్త‌ర‌ణ చేయ‌ర‌ని అంటున్నారు. గ‌వ‌ర్న‌ర్ ఉన్న విభేదాలు ఇందుకు కార‌ణం అంటున్నారు. గ‌వ‌ర్న‌ర్‌తో పూర్తి గ్యాప్ మెయింటెన్ చేస్తున్న కెసిఅర్ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ కోసం రాజ్‌భ‌వ‌న్ గ‌డ‌ప‌తోక్క‌డం అసాధ్యం అనేది టిఅర్ఎస్‌లో చ‌ర్చజ‌రుగుతుంది. అవ‌స‌ర‌మైతే ఇదే మంత్రివ‌ర్గాన్ని కాని గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌ర‌ని గ‌ట్టిగా చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: Pranahita Pushkaralu: ఇవాళ్టి నుంచి ప్రాణహిత నది పుష్కరాలు.. మధ్యాహ్నం తర్వాత నదిలోకి పుష్కర పురుషుడు..

Tree City: భాగ్యనగరానికి మరో అరుదైన గుర్తింపు.. రెండోసారి ట్రీ సిటీగా..