AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akbaruddin Owaisi Case: అక్బరుద్దీన్ ఒవైసీకి ఊరట.. హేట్ స్పీచ్ కేసులు కొట్టివేసిన నాంపల్లి కోర్ట్

అక్బరుద్దీన్ ఒవైసీకి ఊరట లభించింది. అక్బర్‌ హేట్‌ స్పీచ్‌పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. హేట్ స్పీచ్‌కు సంబంధించిన రెండుల కేసులను కోర్టు కొట్టివేసింది.

Akbaruddin Owaisi Case: అక్బరుద్దీన్ ఒవైసీకి ఊరట.. హేట్ స్పీచ్ కేసులు కొట్టివేసిన నాంపల్లి కోర్ట్
Akbaruddin
Balaraju Goud
|

Updated on: Apr 13, 2022 | 4:33 PM

Share

Akbaruddin Owaisi Hate Speech Case:అక్బరుద్దీన్ ఒవైసీకి ఊరట లభించింది. అక్బర్‌ హేట్‌ స్పీచ్‌పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. హేట్ స్పీచ్ కేసులు కొట్టివేస్తూ నాంపల్లి కోర్ట్ తీర్పునిచ్చింది. అక్బరుద్దీన్ పై నమోదైన రెండు కేసులు కొట్టివేస్తున్న న్యాయమూర్తి ప్రకటించారు. భవిష్యత్తు లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయకూడదని వార్నింగ్ ఇచ్చారు. అటువంటి ప్రసంగాలు దేశ సమగ్రతకు మంచిది కాదని హితవు పలికారు. ఇదేదో విజయమని భావించవచ్చదని.. విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తే చర్చలు తీసుకుంటామని నాంపల్లి కోర్ట్ న్యాయమూర్తి హెచ్చరించారు. అక్బరుద్దీన్ హేట్‌ స్పీచ్‌పై ఎఫ్‌ఐఆర్‌లో దేశ ద్రోహం కింద పలు సెక్షన్ల కేసులు నమోదయ్యాయి. అయితే కోర్టుకి సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో మాత్రం ఆ సెక్షన్లను తొలగించడం చర్చనీయాంశంగా మారింది.

నిర్మల్‌లో దాదాపు పదేళ్ల కిందట అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ ప్రసంగంపై ఐపీసీ 120 B, 153 A, 295, 298, 188 సెక్షన్ల కింద పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. కేసులో అరెస్టయిన అక్బరుద్దీన్.. 40 రోజులు జైల్లో శిక్ష అనుభవించారు. అటు ఆదిలాబాద్‌లో హిందూ దేవతలపై అక్బరుద్దీన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు కేసులకు సంబంధించి నాంపల్లి కోర్టు సుదీర్ఘ కాలం పాటు విచారణ జరిపిన ఇవాళ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 30 మంది సాక్షులను న్యాయస్థానం విచారించింది. ఈ కేసులో గతంలో అరెస్టైన అక్బరుద్దీన్‌ 40 రోజుల పాటు జైల్లో ఉన్నారు. అయితే, దీనిపైనే అనుమానం వ్యక్తం చేస్తోంది బీజేపీ. సాక్ష్యాధారాలు సేకరించడంలో పోలీసులు విఫలం అయ్యారని ఆరోపించారు ఆ పార్టీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు.

ఇదిలావుంటే, అక్బరుద్దీన్ తీర్పుతో పాతబస్తీలో పోలీసుల అలెర్ట్ అయ్యారు. కోర్ట్ ఆదేశాలను అనుగుణంగా సంబరాలకు అనుమతి లేదంటూ పోలీసులు తెలిపారు. నిరసన ర్యాలీలకు కూడా అనుమతి లేదన్నారు. నిబంధనలు ఉల్లఘింస్తే కేసులు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కాగా, పాతబస్తీలో ఎప్పటికప్పుడు పరిస్థితిని పోలీస్ ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. Read Also… Andhra Pradesh: జనసేనానిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశంసలు.. తమ ప్రాంతానికి కూడా రావాలని ఆహ్వానం

ఈ ఏడాదిలో రెండు చంద్ర గ్రహణాలు, బ్లడ్ మూన్ ఎప్పుడు కనిపిస్తాడంటే?
ఈ ఏడాదిలో రెండు చంద్ర గ్రహణాలు, బ్లడ్ మూన్ ఎప్పుడు కనిపిస్తాడంటే?
మీ కడుపులోని ఈ బ్యాక్టీరియానే మీ బాడీ గార్డ్ అని మీకు తెలుసా?
మీ కడుపులోని ఈ బ్యాక్టీరియానే మీ బాడీ గార్డ్ అని మీకు తెలుసా?
రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.
రీల్స్ స్టార్లు ఖబర్దార్.! అలా చేస్తే సెలబ్రిటీలైనా వదిలేది లేదు.
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
'ధురంధర్'లో విలన్‌ రోల్‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో ఎవరంటే?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
చచ్చాంరా బాబోయ్...అసలే ఉప్పు తినొద్దంటుంటే అందులోనూ కల్తీనా?
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
కష్టాలను తట్టుకుని పట్టుదలే పెట్టుబడిగా.. పర్పుల్ డ్రీమ్స్‌తో..
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!
రథ సప్తమి నుంచి వారి జీవితాల్లో కొత్త వెలుగులు..!
వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్
వివాదాల సుడిగుండంలో టాక్సిక్ టీజర్
ఫేక్.. ప్లాస్టిక్ కోడి గుడ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
ఫేక్.. ప్లాస్టిక్ కోడి గుడ్లను ఎలా గుర్తించాలో తెలుసా?
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..
వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్.. ఇకపై టోల్ చెల్లించాలంటే..