AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TRS – BRS: అభ్యంతరాలుంటే చెప్పండి.. పార్టీ పేరు మార్పుపై టీఆర్ఎస్ బహిరంగ ప్రకటన..

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరు మార్పుపై ఆ పార్టీ బహిరంగ ప్రకటన జారీ చేసింది. టీఆర్ఎస్ పార్టీ పేరును ‘భారత్‌ రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్) గా మారుస్తున్నట్లు వెల్లడించింది.

TRS - BRS: అభ్యంతరాలుంటే చెప్పండి.. పార్టీ పేరు మార్పుపై టీఆర్ఎస్ బహిరంగ ప్రకటన..
BRS Party CM KCR
Shaik Madar Saheb
|

Updated on: Nov 07, 2022 | 3:02 PM

Share

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరు మార్పుపై ఆ పార్టీ బహిరంగ ప్రకటన జారీ చేసింది. టీఆర్ఎస్ పార్టీ పేరును ‘భారత్‌ రాష్ట్ర సమితి’ (బీఆర్ఎస్) గా మారుస్తున్నట్లు వెల్లడించింది. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ పేరిట జారీ అయిన ఈ ప్రకటనలో.. పార్టీ కొత్త పేరుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే పంపాలంటూ సూచించారు. అభ్యంతరాలను 30 రోజుల్లోపు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని వెల్లడించారు. భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఇప్పటికే గుర్తింపు పొందిన రాజకీయ పార్టీకి పేరు మార్పు, ఇతరత్రా సవరణలు ఉంటే వాటిపై అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది. దీనికోసం స్థానిక పత్రికలతో పాటు ఆంగ్ల పత్రికల్లోనూ సదరు పార్టీ ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం నిబంధనల మేరకు టీఆర్ఎస్ ప్రకటన జారీ చేసింది.

కాగా.. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పార్టీ పేరు మార్పు గురించి కేంద్ర ఎన్నికల సంఘానికి కావాల్సిన పత్రాలన్నింటినీ సమర్పించారు. ఈ క్రమంలో పార్టీ పేరు మారితే.. మునుగుడు ఉపఎన్నిక టీఆర్ఎస్ పార్టీకి చివరి ఎన్నిక కానుంది. ఇకముందు నుంచి బీఆర్ఎస్ పేరుతోనే గులాబీ దళం రంగంలోకి దిగనుంది. అయితే, జాతీయ పార్టీ బీఆర్ఎస్ ప్రకటించిన అనంతరం మునుగోడులో తొలి విజయం సాధించడంతో.. పార్టీ శ్రేణులు సంబరపడుతున్నారు. భారత్ రాష్ట్ర సమితికి ఇది తొలి విజయమని.. ఇదే పద్ధతిలో పార్టీకి మున్ముందు కలిసివస్తుందని పేర్కొంటున్నారు.

అయితే.. మునుగోడు ఉప ఎన్నిక ఫలితంతో ఫుల్ జోష్‌లో ఉన్న పార్టీ శ్రేణులు.. భారత్ రాష్ట్ర సమితి విస్తరణకు పావులు కదుపుతున్నారు. జాతీయ రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని.. బీజేపీ లక్ష్యంగా భారత రాష్ట్ర సమితిని బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో జరగనున్న హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్‌ఎస్‌ ప్రచారం చేయడంతోపాటు.. పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు పలు రాష్ట్రాల కీలక నేతలతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారని సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..