Warangal Politics: ఇక గుద్దుడే.. గుద్దుడు.. ప్రదీప్‌రావును టార్గెట్‌ చేస్తూ ఎమ్మెల్యే నన్నపనేని సంచలన వ్యాఖ్యలు..

ప్రదీప్‌రావు, అతని అనుచరులపై ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ పరోక్షంగా హాట్‌ కామెంట్స్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి మోసం చేస్తే.. ఇక గుద్దుడే అంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

Warangal Politics: ఇక గుద్దుడే.. గుద్దుడు.. ప్రదీప్‌రావును టార్గెట్‌ చేస్తూ ఎమ్మెల్యే నన్నపనేని సంచలన వ్యాఖ్యలు..
Nannapuneni Narender, Errabelli Pradeep Rao

Edited By:

Updated on: Aug 06, 2022 | 3:04 PM

Nannapuneni Narender vs Errabelli Pradeep Rao: వరంగల్‌లో పొలిటికల్‌ హీట్‌ అమాంతం పెరిగిపోయింది. ఇప్పటివరకు అధికార పార్టీలో కొనసాగిన బుజ్జగింపులు ముగిశాయ్‌, ఇప్పుడు బెదిరింపులు, వార్నింగ్‌లు మొదలయ్యాయి. కారు దిగేందుకు సిద్ధమైన ఎర్రబెల్లి ప్రదీప్‌రావుపై ఇన్‌డైరెక్ట్‌గా విరుచుకుపడ్డారు.. వరంగల్‌ ఈస్ట్‌ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌. ప్రదీప్‌రావు, అతని అనుచరులపై ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ పరోక్షంగా హాట్‌ కామెంట్స్‌ చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి మోసం చేస్తే.. ఇక గుద్దుడే అంటూ వార్నింగ్‌ ఇచ్చారు. అమాయకుడిని అనుకుంటున్నావేమో, కుమ్రంభీమ్‌లా తిరగబడతా, పులిలా పంజా విసిరి చీరేస్తా అంటూ ఒక రేంజ్‌లో చెలరేగిపోయారు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌.

తన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ వేదికగా ప్రదీప్‌రావుపై.. నన్నపనేని నరేందర్‌ ఇన్‌డైరెక్ట్‌గా చెలరేగిపోయారు. ఇక రోజులు లెక్కబెట్టుకోండిరా అంటూ హెచ్చరికలు పంపారు. పూటకో పార్టీ మార్చే చిల్లర నాయకుడంటూ ఘాటైన కామెంట్స్‌ చేశారు. ఓపెన్‌ ఛాలెంజ్‌ విసురుతున్నా, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల జోలికొస్తే ఎంతకైనా సిద్ధమంటూ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

నన్నపనేని నరేందర్‌ హాట్ కామెంట్స్‌ తో వరంగల్‌ ఈస్ట్‌ నియోజకవర్గంతోపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పొలిటికల్‌ హీట్‌ పెరిగిపోయింది. అయితే, కారు జర్నీ ముగించేందుకు సిద్ధమైన ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, రేపు టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. బుజ్జగింపుల ఎసిసోడ్‌ తర్వాత, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌ ఈ రేంజ్‌లో ఘాటు కామెంట్స్‌ చేయడంతో టీఆర్ఎస్‌కు రాజీనామా చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి