TRS Foundation Day: జాతీయ రాజకీయాల్లోకి టీఆర్ఎస్.. సమావేశంలో ప్రవేశ పెట్టనున్న తీర్మానాలు ఇవే..

| Edited By: Ravi Kiran

Apr 27, 2022 | 2:00 PM

TRS Foundation Day: తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ఆవిర్భావ దినోత్సవాన్ని గులాబీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మరికాసేపట్లో ప్లీనరీ సమావేశం జరగనుంది.

TRS Foundation Day: జాతీయ రాజకీయాల్లోకి టీఆర్ఎస్.. సమావేశంలో ప్రవేశ పెట్టనున్న తీర్మానాలు ఇవే..
Trs Foundation Day
Follow us on

TRS Foundation Day: తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) ఆవిర్భావ దినోత్సవాన్ని గులాబీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా మరికాసేపట్లో ప్లీనరీ సమావేశం జరగనుంది. దీంతో హైదరాబాద్‌ గులాబీ మయంగా మారింది. హైదరాబాద్‌ HICCలో జరుగనున్న ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ వేదిక నుంచి.. పలు అంశాలతో పాటు 2023 ఎన్నికల వ్యూహం గురించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా.. పార్టీ 21వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని CM KCR తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి ప్లీనరీని ప్రారంభించనున్నారు. ఆ వెంటనే KCR ప్రసంగం ఉంటుంది. అనంతరం వివిధ అంశాలపై రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు. అనంతరం వీటిపై చర్చించి ఆమోదించనున్నారు.

ఈ సమావేశంలో మొత్తం 11 తీర్మానాలను ప్రవేశ పెట్టనున్నారు. వీటిలో రాజకీయ తీర్మానాలు, తెలంగాణపై కేంద్రం వివక్ష తదితర అంశాలపై తీర్మానాలు చేయనున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

  • యాసంగిలో వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయక పోయినా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నందుకు అభినందన తీర్మానం.
  • దేశం విస్తృత ప్రయోజనాల రీత్యా జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ కీలక భూమిక పోషించాలని రాజకీయ తీర్మానం.
  • ఆకాశాన్నంటిన ధరలు పెంచుతూ పేద మధ్యతరగతి ప్రజల మీద మోయలేని భారం వేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధరల నియంత్రణను డిమాండ్ చేస్తూ తీర్మానం.
  • చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింప చేసి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం.
  • భారతదేశ సామరస్య సంస్కృతిని కాపాడుకోవాలని మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని తీర్మానం.
  • బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వంలో బీసీ సంక్షేమ మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని బీసీ వర్గాల జనగణన జరపాలని డిమాండ్ చేస్తూ తీర్మానం.
  • తెలంగాణ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్ శాతం పెంచాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం.
  • రాష్ట్రాల ఆదాయానికి గండి కొడుతూ కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్ ల రూపేణా వసూలు చేయడం మానుకోవాలని డివిజబుల్ పూల్ లోనే పన్నులు వసూలు వసూలు చేయాలని తీర్మానం.
  • నదీ జలాల వివాద చట్టం సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జిల్లాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా నిర్వహించాలని ఈమేరకు బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ కు కేంద్రం రిఫర్ చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం.
  • భారత రాజ్యాంగం ప్రతిపాదించిన సమాఖ్య విలువలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ తీర్మానం.
  • తెలంగాణ రాష్ట్రంలో నవోదయ విద్యాలయాలను వైద్య కళాశాలలను వెంటనే ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం.

Also Read:

TRS Foundation Day Live: పింక్ సిటీగా మారిన భాగ్యనగరం.. తరలివస్తున్న గులాబీ దళం..

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఉచితంగా సినిమా చూసేలా సేవలు