ఉద్యమ కేసీఆర్‌తో సమస్య లేదు.. సీఎం కేసీఆర్‌తోనే వచ్చింది.. సంచలన నిజాలు బయటపెట్టిన కవిత
తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మార్పు కోసం "తెలంగాణ రక్షణ సేన" పార్టీని స్థాపించానని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు, కఠిన పరిస్థితులు చూశాకే తనలో ఈ మార్పు వచ్చిందన్నారు.

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త మార్పు కోసం “తెలంగాణ రక్షణ సేన” పార్టీని స్థాపించానని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ అధినేత్రి కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు, కఠిన పరిస్థితులు చూశాకే తనలో ఈ మార్పు వచ్చిందన్నారు. గత ప్రభుత్వంలో గానీ, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గానీ రైతులకు న్యాయం జరగలేదని.. కేవలం ‘ధరణి’ పేరును ‘భూమాత’గా మార్చారు తప్ప, ఆట మారలేదని విమర్శించారు. ముఖ్యంగా నీటి పారుదల రంగంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, గోదావరి జలాలు సముద్రం పాలువుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
“ఉద్యమ నేతగా కేసీఆర్‌తో ఎలాంటి సమస్య లేదు, ఆయన రాష్ట్రాన్ని సాధించిన గొప్ప వ్యక్తి. కానీ, ముఖ్యమంత్రిగా, బీఆర్ఎస్ అధినేతగా ఉన్న కేసీఆర్‌తోనే నాతో పాటు చాలా మందికి సమస్య వచ్చింది. పార్టీ అంతర్గత సమావేశాల్లో నేను చెప్పిన భిన్నమైన అభిప్రాయాలను బయటపెట్టి, నన్ను బయటకు వెళ్లేలా చేశారు” అని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ వివాదంపై స్పందిస్తూ.. కోర్టు ఆ ఆరోపణలను కొట్టివేసిందని, అయితే ఆ కష్టకాలంలో తన పుట్టింటి కుటుంబం మా అమ్మ, కుటుంబం నుంచి సరైన సపోర్ట్ రాలేదని, కానీ అత్తగారి కుటుంబం తనకు కొండంత అండగా నిలిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, రోజుకు 7 అత్యాచార కేసులు నమోదు కావడం దారుణమన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై వచ్చిన తీవ్రమైన ఆరోపణల కేసులో సీఎం రేవంత్ రెడ్డి నాన్-బెయిల్ సెక్షన్లు ఉన్నా అరెస్ట్ చేయకుండా మేలు చేస్తున్నారని ఆరోపించారు. మోదీ, రేవంత్ రెడ్డి కలిసే ఉన్నారని, అందుకే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీఎం కాదు, “ఆర్ఎస్ఎస్ సీఎం” అని విమర్శించారు. విచారణ సజావుగా సాగాలంటే బండి సంజయ్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పించాలని ప్రధానికి లేఖ రాస్తానన్నారు. రాజకీయాల్లో మహిళలకు ఆదర్శంగా నిలిచి, భవిష్యత్తులో తెలంగాణ ప్రజలకు మర్చిపోలేనంత మంచి చేసి చరిత్రలో నిలిచిపోవాలన్నదే తన ఏకైక కోరిక అని కవిత పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
