Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..

Revanth Reddy: మల్కాజిగిరి ఎంపీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా గాంధీ భవన్...

Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారోత్సవం ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో పలు రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు..
Hyderabad Traffic Police
Follow us

|

Updated on: Jul 07, 2021 | 2:27 PM

Revanth Reddy: మల్కాజిగిరి ఎంపీ, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా గాంధీ భవన్, నాంపల్లి సహా పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులకు ఇబ్బంది కలుగకుండా ట్రాఫిక్ పోలీసులు.. ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. గాంధీ భవన్, నాంపల్లి మీదుగా వెళ్లే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ మేరకు ట్రాఫిక్ మళ్లింపునకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేశారు.

1. రవీంద్ర భారతి నుండి ఎంజే మార్కెట్‌కు వెళ్లే వాహనదారులను ఎఆర్ పెట్రోల్ పంప్ రోడ్ వద్ద బిజెఆర్ విగ్రహం – జిపిఓ అబిడ్స్ – ఎంజె మార్కెట్ జంక్షన్ వైపు మళ్లిస్తున్నారు. 2. అలస్కా, మలకుంట నుండి వచ్చే వాహనదారులను గాంధీ భవన్‌కు వెళ్లకుండా ఎంజే మార్కెట్ జంక్షన్ నుంచి కుడివైపు తిప్పి పంపుతున్నారు. 3. పుత్లిబౌలి ఎక్స్ రోడ్స్ నుంచి జంబాగ్ రోడ్డు, బేగం బజార్ ద్వారా వచ్చే ప్రయాణికులు ఎంజె మార్కెట్ నుండి జిపిఓ అబిడ్స్ మార్గం వైపు వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. 4. ఏక్-మినార్ నుండి వచ్చే వాహనదారులు, ఎంజే మార్కెట్‌ వైపునకు వెళ్లాలనుకునే వాహనదారులు నాంపల్లి స్టేషన్ రోడ్డు గుండా వెళ్లాలని సూచిస్తున్నారు. 5. బిజెపి కార్యాలయం గల్లీ నుంచి వచ్చే వాహనదారులు ఎంజే మార్కెట్ వైపు వెళ్లాలని సూచించారు.

Also read:

Case on Bhargavram: మొదటి కేసులో నుంచి ఇంకా బయటపడలేదు.. మళ్లీ ఇంకో కేసు నమోదు..!