Hyderabad: నేడు మూడు టిమ్స్‌ ఆస్పత్రుల పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్‌.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) నేడు నగరంలో పర్యటించనున్నారు. వైద్య సేవల విస్తరణలో భాగంగా ఒకేరోజు మూడుచోట్ల తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (TIMS) ఆస్పత్రులకు ఆయన భూమి పూజ చేయనున్నారు.

Hyderabad: నేడు మూడు టిమ్స్‌ ఆస్పత్రుల పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్‌.. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు..
Cm Kcr

Updated on: Apr 26, 2022 | 8:16 AM

ముఖ్యమంత్రి కేసీఆర్‌ (CM KCR) నేడు నగరంలో పర్యటించనున్నారు. వైద్య సేవల విస్తరణలో భాగంగా ఒకేరోజు మూడుచోట్ల తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (TIMS) ఆస్పత్రులకు ఆయన భూమి పూజ చేయనున్నారు. ఎల్బీనగర్‌లోని గడ్డి అన్నారంలోని పాత పండ్ల మార్కెట్‌, ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి ప్రాంగణం, అల్వాల్‌ రైతు బజార్ల ఎదురుగా నిర్మించనున్న ఈ ఆస్పత్రుల పనులకు మంగళవారం మధ్యాహ్నం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు. కాగా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నగరంలోని ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని నగర ట్రాఫిక్‌ జాయింట్‌ కమిషనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అల్వాల్‌ పరిధిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు తిరుమలగిరి కూడలి నుంచి బొల్లారం చెక్‌పోస్ట్‌ వరకు, బొల్లారం చెక్‌పోస్టు నుంచి తిరుమలగిరి కూడలి వరకు రద్దీ ఉంటుందని, వాహనదారులు ఈ విషయం గమనించి అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని కమిషనర్‌ సూచించారు.

ట్రాఫిక్‌ మళ్లింపులు ఇలా..

* జేబీఎస్‌ నుంచి కరీంనగర్‌ హైవే వైపు టీవోలి కూడలి మీదుగా బ్రూక్‌ బాండ్‌ వైపు, బాలంరాయి, తాడ్‌బండ్‌, బోయిన్‌పల్లి నుంచి సుచిత్ర, మేడ్చల్‌ నుంచి ఓఆర్‌ఆర్‌ వరకు ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయి.

* హోలీ ఫ్యామిలీ జంక్షన్‌ వద్ద లెఫ్ట్‌ తీసుకొని ఖానాజీగూడ వైపు, డైరీఫామ్‌ వద్ద కుడివైపు తీసుకొని సుచిత్ర, కొంపల్లి నుంచి మేడ్చల్‌, ఓఆర్‌ఆర్‌ వైపు ట్రాఫిక్‌ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయి.

* తెలంగాణ తల్లి విగ్రహం, ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఎడమ వైపు నుంచి సుచిత్ర జంక్షన్‌, కొంపల్లి, మేడ్చల్‌ ఓఆర్‌ఆర్‌ వైపు, ఇందిరాగాంధీ విగ్రహం వద్ద కుడిపైపు బొల్లారం చెక్‌పోస్టు నుంచి కరీంనగర్‌ హైవే మీదుగా హైదరాబాద్‌ వైపు.

* ఓఆర్‌ఆర్‌ శామీర్‌పేట్‌, ఓఆర్‌ఆర్‌ ఘట్‌కేసర్‌ నుంచి ఉప్పల్‌ వైపు, ఓఆర్‌ఆర్‌ కండ్లకోయ కొంపల్లి నుంచి సుచిత్ర మీదుగా బోయినపల్లి వైపు

* దొంగల మైసమ్మ దేవాలయం/బిట్స్‌ జంక్షన్‌ చీరియా నుంచి కీసర, కుషాయిగూడ నుంచి ఈసీఐఎల్‌ ఎక్స్‌ రోడ్డు నుంచి మౌలాలి మీదుగా తార్నాక వరకు..

* తూముకుంట ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి దేవరయంజాల్‌ వైపు, మెడికవర్‌ ఆసుపత్రి నుంచి కొంపల్లి, సుచిత్ర బోయినపల్లి వైపు వెళ్లాలి.

* బొల్లారం చెక్‌పోస్టు వద్ద ఎడమ నుంచి కౌకూరు వైపు, యాప్రాల్‌ నుంచి లోతుకుంట, లాల్‌బజార్‌, తిరుమలగిరి వైపు వెళ్లాలి.

Also Read:

RBI: బ్యాంకులకు షాకిస్తున్న ఆర్బీఐ.. ఈ బ్యాంకుకు రూ.1.12 కోట్ల జరిమానా.. ఎందుకో తెలుసా..?

Suriya : బాలీవుడ్‌లోకి సూర్య సూపర్ హిట్ మూవీ.. హీరోగా స్టార్ హీరో అక్షయ్ కుమార్

Elon Musk: టెస్లా అధినేత సొంతమైన ట్విట్టర్.. ఎంత ధరకు కొన్నాడో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే..