Hyderabad Traffic Diversion: హైదరాబాద్‌లో నేటి నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఏయే ప్రాంతాల్లో ట్రాఫిక్స్ డైవర్షన్స్ ఉన్నాయంటే..

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. శనివారం, ఆదివారం ఎన్టీఆర్ మార్గ్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ జరుగనున్న నేపథ్యంలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Hyderabad Traffic Diversion: హైదరాబాద్‌లో నేటి నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఏయే ప్రాంతాల్లో ట్రాఫిక్స్ డైవర్షన్స్ ఉన్నాయంటే..
Hyderabad Traffic Restricti

Updated on: Dec 09, 2022 | 9:47 AM

హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. శనివారం, ఆదివారం ఎన్టీఆర్ మార్గ్‌లో ఇండియన్ రేసింగ్ లీగ్ జరుగనున్న నేపథ్యంలో ఈ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రకటించారు. ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్డు, బుద్ధ భవన్, నల్లగుట్ట జంక్షన్, ఇక్బాల్ మినార్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఈ రూట్లలో వాహనాలకు అనుమతి లేదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.

ట్రాఫిక్ ఆంక్షలు ఉన్న ప్రాంతాలివే..

1. ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్డు క్లోజ్ ఉంటుంది.

2. బుద్ధభవన్, నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్డు ఐమాక్స్ వైపు వాహనాలకు నో ఎంట్రీ.

ఇవి కూడా చదవండి

3. ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి ట్యాంక్‌బండ్ వెళ్లే వాహనాలకు అనుమతి నిరాకరించారు.

4. బీఆర్‌కే భవన్‌ నుంచి నెక్లెస్‌ రోడ్‌ వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు.

హైదరాబాద్ వేదికగా నవంబర్ 19, 20 తేదీల్లో ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందుకోసం నెక్లెస్ రోడ్డులో 2.7 కిలోమీటర్ల మేర ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్లీ డిసెంబర్ 10, 11 తేదీల్లో ఈ పోటీలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు అధికారులు. ఫిబ్రవరి 11న ఫార్ములా–ఈ కార్‌ రేసింగ్‌‌లో భాగంగా ఈ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..