Revanth Reddy Padayatra: ‘యాత్ర’ పేరుతో జనంలోకి రేవంత్‌రెడ్డి.. షెడ్యూల్ విడుదల చేసిన టి.పీసీసీ..
తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. జనవరి 26 నుంచి ‘హాత్ సే హాత్ జోడో’ పేరుతో ఈ పాదయాత్ర సాగనుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం గాంధీ భవన్‌లో జరిగిన సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు పార్టీ నేతలు. పార్టీని రాష్ట్రంలో పటిష్టం చేసే అంశంపై చర్చించారు. తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. జనవరి 26 నుంచి ‘హాత్ సే హాత్ జోడో’ పేరుతో ఈ పాదయాత్ర సాగనుందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఈ యాత్ర చేపట్టనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కనీసం రెండు నెలలపాటు యాత్ర చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఈ యాత్ర చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో తాను ఈ యాత్ర చేపడతానన్నారు. పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధమవుతోందని రేవంత్ వెల్లడించారు.
ఇదిలావుంటే, ఆ పార్టీలో వర్గ పోరు మొదలైంది. రెండు వర్గాలు చీలిపోయింది తెలంగాణ కాంగ్రెస్. పార్టీ ప్రకటించిన పీసీసీ కమిటీల్లో తమకు, తమ వర్గం నేతలకు పదవులు దక్కలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే, టీడీపీ నుంచి వలస వచ్చిన వారికే పదవులు ఇచ్చారని సీనియర్లు ఆరోపించడంతో.. రేవంత్ వర్గానికే పలువరు నేతలు వెంటనే పార్టీ పదవులకు రాజీనామా చేశారు. దీంతో రేవంత్ వర్సెస్ సీనియర్లు అన్నట్లు వ్యవహారం సాగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం