Revanth Reddy: రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కి ప్రమాదం.. పరస్పరం ఢీకొట్టిన 6 కార్లు..

|

Mar 04, 2023 | 2:23 PM

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఓవర్ స్పీడ్‌తో ఆరు కార్లు పరస్పరం ఢీకొన్నాయి. కారు ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో నేతలకు ముప్పు తప్పింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.

Revanth Reddy: రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కి ప్రమాదం.. పరస్పరం ఢీకొట్టిన 6 కార్లు..
Revanth Reddy
Follow us on

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఓవర్ స్పీడ్‌తో ఆరు కార్లు పరస్పరం ఢీకొన్నాయి. కారు ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో నేతలకు ముప్పు తప్పింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌ దగ్గర ఘటన చోటు చేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

హాత్ సే హాత్ జోడో యాత్ర పేరుతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. మేడారంలో సమ్మక్క సారలమ్మ ఆలయం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది. అలా మొదలైన పాదయాత్ర ఇవాళ సిరిసిల్ల  నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో రేవంత్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది.

టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం..

ఇదిలాఉంటే.. గాంధీభవన్ టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరుగుతోంది. పార్టీ రాష్ట్ర వ్యహారాల ఇంచార్జ్ మాణిక్‌రావు థాక్రే అధ్యక్షతన భేటి కొనసాగుతోంది. సమావేశంలో హాత్ సే హాత్ జోడో యాత్రలపై సమీక్షిస్తున్నారు. పరిశీలకులుగా వచ్చిన గిరీష్ చౌడొంకర్ వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే, టీపీసీసీ విస్త్రృతస్థాయి సమావేశంలో పార్టీలో వర్గపోరుపై చర్చించే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్రంలో పోటాపోటీ యాత్రలు అంటూ అలజడి మొదలైంది. రేవంత్‌ రెడ్డి‌ యాత్రకు దూరంగా ఉన్న కొందరు సీనియర్‌ నేతలు మహేశ్వర్‌రెడ్డి తలపెట్టిన తెలంగాణ కాంగ్రెస్ పోరుయాత్రలో పాల్గొనడం పార్టీలో ప్రకంపనలు రేపింది. సేవ్‌ కాంగ్రెస్ గ్రూపు నేతలు ఇప్పటికీ రేవంత్‌రెడ్డిని వ్యతిరేకిస్తున్నట్టు తాజా పరిణామాలు అద్దం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై తాడోపేడో తేల్చేకోవడానికి రేవంత్‌ వర్గం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..