AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Munugode bypoll: క్లైమాక్స్‌‌కు చేరిన ప్రచారం.. ఫైనల్‌ టచ్‌గా కేసీఆర్, నడ్డా సభలు.. మునుగోడు నుంచి టాప్-9 న్యూస్

మునుగోడు ఉపఎన్నిక ప్రచారం క్లైమాక్స్‌కు చేరింది. ఇవాళ KCR బహిరంగ సభవైపే అందరి చూపూ ఉంది. కాంట్రాక్టులు, కొనుగోళ్లు సహా అనేక అంశాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో వీటన్నింటికీ కేసీఆర్‌ ఎలాంటి కౌంటర్ ఇస్తారనేది ఆసక్తి రేపుతోంది.

Munugode bypoll: క్లైమాక్స్‌‌కు చేరిన ప్రచారం.. ఫైనల్‌ టచ్‌గా కేసీఆర్, నడ్డా సభలు.. మునుగోడు నుంచి టాప్-9 న్యూస్
Munugode Bypoll
Ram Naramaneni
|

Updated on: Oct 30, 2022 | 3:35 PM

Share
  1. మునుగోడులో ప్రచారం క్లైమాక్స్‌కి చేరింది. ఇవాళ చండూరు మండలం బంగారిగడ్డలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసింది టీఆర్‌ఎస్‌. సీఎం కేసీఆర్‌ పాల్గొంటున్న ఈ మీటింగ్‌కోసం విస్తృత ఏర్పాట్లు చేశాయి పార్టీ శ్రేణులు. భారీ సంఖ్యలో జనాన్ని తరలిస్తున్నారు నేతలు. ఇప్పటికే సభా ప్రాంగణాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు.
  2. చండూరులో టీఆర్‌ఎస్‌ సభా నిర్వహణ ఒకెత్తయితే… గులాబీ దళపతి ప్రసంగం సర్వత్రా మరంత ఉత్కంఠ రేపుతోంది. బీఆర్‌ఎస్‌ ప్రకటన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న మీటింగ్‌ కావడంతో కేసీఆర్‌ ఏం మాట్లాడుతారోనన్న సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఎమ్మెల్యేలకు ఎర ఎపిసోడ్‌ అంశంపైనా కేసీఆర్‌ స్పందించే అవకాశం ఉండటంతో… సార్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుందనే విషయంలో ఆసక్తి ఏర్పడింది.
  3. మునుగోడులో ప్రచారం పీక్స్‌కు చేరిన వేళ… టీవీ9 డిబేట్‌లో బీజేపీపై మంత్రి కేటీఆర్‌ చేసిన ఆరోపణలు ఇప్పడు సంచలనం రేపుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి చెందిన సుశీ ఇన్‌ ఫ్రా నుంచి 5 కోట్ల 22 లక్షల రూపాయలు వేర్వేరు అకౌంట్లలో జమ అయినట్టు ఆధారాలతో సహా చూపించారు కేటీఆర్‌. ఆ అకౌంట్లన్నీ బీజేపీ కార్యకర్తలవేనన్నారు. ఈ అంశంపై టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది.
  4. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి చెందిన సుశీ ఇన్‌ ఫ్రా నుంచి.. నగదు బదిలీ అయ్యిందన్న ఆరోపణల్ని ఖండించింది బీజేపీ. సుశీ ఇన్‌ ఫ్రా సైతం ఈ అలిగేషన్స్‌ను తిప్పికొట్టింది. కేటీఆర్‌ ఆరోపణలు అవాస్తవమనీ.. కంపెనీ సీఈవో, కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కుమారుడు సంకీర్త్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. 5 కోట్ల 22 లక్షల రూపాయలు వేర్వేరు అకౌంట్లలో జమయ్యాయన్నది పూర్తి అవాస్తవమన్నారు.
  5. నగదు బదిలీ ఆరోపణలపై వెనక్కి తగ్గలేదు టీఆర్‌ఎస్‌. దీనిపై చర్యలు తీసుకోవాలని ఈసీని ఆశ్రయించింది. మునుగోడులో నగదు బదిలీ అయిన అకౌంట్లన్నీ బీజేపీ కార్యకర్తలవేననీ ఈసీకి ఫిర్యాదు చేసిన టీఆర్‌ఎస్‌… వాటిని వెంటనే ఫ్రీజ్‌ చేయాలని డిమాండ్‌ చేసింది.
  6. బీజేపీ ఇచ్చిన 18వేల కోట్ల కాంట్రాక్ట్‌ డబ్బునే… రాజగోపాల్‌రెడ్డి మునుగోడులో పంచుతున్నారని ఆరోపించారు టీఆర్‌ఎస్‌ ఎంపీ లింగయ్య యాదవ్‌. రాజగోపాల్‌ రెడ్డి కంపెనీ నుంచి డబ్బు ట్రాన్స్‌ఫర్‌ అయిన అకౌంట్లను వెంటనే ఫ్రీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇలాంటి మనీ ట్రాన్స్‌ఫర్స్‌ ఇంకెన్ని జరగాయనే విషయంలో విచారణ జరిపించాలన్నారు.
  7. మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డిపై మండిపడ్డారు.. కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ. వ్యాపార లబ్దికోసమే పార్టీ మారాడని మండిపడ్డారు. పైసా లేని సుశీ ఇన్‌ఫ్రా కంపెనీకి… వేల కోట్ల ప్రాజెక్టు ఎలా వచ్చిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు యాష్కీ. నష్టాల్లో ఉన్న సుశీ ఇన్‌ఫ్రా కంపెనీని లాభాల్లోకి తెచ్చుకునేందుకే… రాజగోపాల్‌రెడ్డి బీజేపీతో బేరసారాలు జరిపారని ఆరోపించారు.
  8. నేత కార్మికులను టీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి మోసం చేస్తోందని ఆరోపించారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ . మునుగోడు ఉప ఎన్నికల్లో ఓట్ల కోసమే బీజేపీపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాల ఆర్థికమంత్రుల అభిప్రాయంతోనే జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చేనేతలపై ప్రేమ ఉంటే.‌. రాష్ట్ర ప్రభుత్వమే 5 శాతం పన్నును భరించాలన్నారు లక్ష్మణ్‌.
  9. మునుగోడు ప్రచారంలో రోజుకో స్టయిల్‌లో దర్శనమిస్తున్నారు కేఏపాల్‌. తాజాగా గొర్రెల కాపరిగా మారిపోయారు పాల్‌. నల్గొండ జిల్లా నాంపల్లి మండల కేంద్రంలోని పొలం దగ్గర యాదవ కుటుంబాలను కలిశారు కేఏపాల్‌. ఉద్యోగాలు రాకపోవడం వల్లే యువకులు గొర్రెల కాపరులుగా మారిపోయారని కామెంట్‌ చేశారు పాల్‌.