AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బ్రాండ్ ఒకరిది.. సొమ్ము చేసుకునేది మరొకరు.. ఫేక్ హోటళ్లపై సంతోష్ ధాబా కొరడా

హైదరాబాద్‌లో ఇప్పుడు ఈ ఇష్యూ పెద్ద సమస్య అయిపోయింది. ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ పెడతామంటే.. అది ఒరిజినల్‌ రెస్టారెంటో, కాదో తెలియని పరిస్థితి వచ్చింది. ఒకే నేమ్‌ని ట్విస్ట్ చేస్తూ పలు రెస్టారెంట్స్ వచ్చాయి.

Hyderabad: బ్రాండ్ ఒకరిది.. సొమ్ము చేసుకునేది మరొకరు.. ఫేక్ హోటళ్లపై సంతోష్ ధాబా కొరడా
Santosh Dhaba
Ram Naramaneni
|

Updated on: Oct 30, 2022 | 8:16 PM

Share

సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అంటే ఇదేనేమో. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఫలానా చోట ఫుడ్ బాగుంటది అనిపించుకోవడం చాలా కష్టం. ఎందుకంటే రకరకాల ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి సెటిలైపోయారు జనాలు. ఒక్కొక్కరి ఒక్కో టేస్ట్ ఉంటుంది. అయినప్పటికీ తమ మార్క్ క్రియేట్ చేసి.. ఒక బ్రాండ్ ఏర్పరుచుకుని ఫుడ్ లవర్స్‌ను అట్రాక్ట్ చేసే పలు హోటల్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి.  అందులో సంతోష్ ధాబా కూడా ఒకటి. అయితే ఈ సంస్థకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఈ ధాబా పేరును యూజ్ చేసుకుని గత కొన్నేళ్లుగా కాసులు సంపాదించుకుంటున్నాయి కొన్ని ఫేక్ రెస్టారెంట్స్. దీంతో ఆ సంస్థ ట్రేడ్ మార్క్‌ గురించి న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. విజయం సాధించింది. కోర్టు ఉత్తర్వులతో.. పోలీసులను ఆశ్రయించి.. తన నేమ్ యూజ్ చేస్తున్న హోటళ్లపై చర్యలకు ఉపక్రమించింది సంతోష్ ధాబా యాజమన్యాం.

కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉండటంతో..  అత్తాపూర్ సంతోష్ ధాబా నేమ్ తొలగించింది. ఈ సందర్భంగా బాలాజీ ధాబా తరుఫు న్యాయవాది అభిషేక అగర్వాల్ మాట్లాడుతూ నగరంలో ట్రేడ్ మార్క్ లైసెన్స్ నిబంధనలకు విరుద్ధంగా సంతోష్ దాభా పేరును ఉపయోగిస్తూ పలు హోటళ్లు, రెస్టారెంట్స్ వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించామని.. నిబంధనలకు విరుద్దంగా ఆ పేరును వినియోగిస్తున్న పేర్లు తొలగించాలని న్యాయస్థానం ఆర్డర్స్ ఇచ్చిందని వెల్లడించారు.

ఈ క్రమంలో పోలీసుల సాయంతో  నేమ్ తొలగిస్తున్నట్లు తెలిపారు. అత్తాపూర్, మలక్ పేట్, గబ్బిబౌలి, కూకట్ పల్లి, అమిర్ పేట్ సహా పలు ప్రాంతాల్లో ఈ పేరును పలు హోటల్స్ వినియోగించుకుంటున్నాయని వివరించారు. సదరు పేరును వినియోగించుకుంటున్న సంస్థలు వెంటనే పేర్లను రిమూవ్ చేయాలని.. లేని పక్షంలో చట్టపరంగా చర్యలు తీసుకుంటామని న్యాయవాది అభిషేక్ అగర్వాల్ హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..