AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM KCR Public Meeting: అడ్డంగా దొరికిపోయి కూడా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు : సీఎం కేసీఆర్

CM KCR Public Meeting: అడ్డంగా దొరికిపోయి కూడా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు : సీఎం కేసీఆర్

Ram Naramaneni
|

Updated on: Oct 30, 2022 | 4:46 PM

Share

చండూరు సమీపంలోని బంగారిగడ్డలో సీఎం సభకు భారీ ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో సభ మొదలుకానుంది. నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి భారీగా జనసమీకరణ చేస్తున్నారు. మునుగోడు అభివృద్ధిపై కేసీఆర్‌ ఎలాంటి కార్యచరణ ప్రకటిస్తారనేది ఓ అంశమైతే.. ఎమ్మెల్యేల బేరసారాలపై ఏం మాట్లాడుతారనేది మరో అంశంగా కనిపిస్తోంది.

సారొస్తున్నారు. సవాళ్లు విసురుతారా? సై అంటారా? బైపోల్‌ హీట్‌ పెంచేలా పొలిటికల్‌ బాంబులు పేలుస్తారా? బంగారి గడ్డలో ఇవాళ కేసీఆర్‌ విసిరే మాటల తూటాలేంటి? అసలు సార్‌ ఏం చేయబోతున్నారు? అనేది రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మరో రెండు రోజులు మిగిలే ఉంది. మూడు రోజుల పాటు బహిరంగసభలు, సమావేశాలతో హోరెత్తనుంది. క్లైమాక్స్‌కు చేరిన క్యాంపెయిన్‌కు బూస్ట్‌ ఇచ్చేందుకు కేసీఆర్‌ మునుగోడు వెళుతున్నారు. ఎమ్మెల్యేలకు ఎర అంశం హాట్ టాపిక్‌ కావడంతో ఈ సభలో సీఎం ఏం మాట్లాడుతారనే అందటా ఆసక్తి నెలకొంది.

కేసీఆర్‌ సభకు టీఆర్‌ఎస్‌ విస్తృత ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌ ఆయన హెలికాప్టర్‌లో బంగారిగడ్డ సభకు చేరుకుంటారు. నియోజకవర్గవ్యాప్తంగా అన్ని మండలాల నుంచి జనాన్ని సభకు తరలించే ప్రయత్నాల్లో నేతలు ఉన్నారు. మునుగోడు అభివృద్ధిపై కేసీఆర్‌ ఎలాంటి కార్యచరణ ప్రకటిస్తారనేది ఓ అంశమైతే.. సంచలనంగా మారిన ఎమ్మెల్యేల బేరసారాలపై కేసీఆర్‌ ఏం మాట్లాడుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. బంగారిగడ్డ సభ వేదికగా కేసీఆర్‌ ఎలాంటి యాక్షన్‌ ప్లాన్‌ ప్రకటిస్తారన్న ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Published on: Oct 30, 2022 02:57 PM