రాత్రైందంటే ఆ ప్రాంతమంతా వింత శబ్దాలు.. మిరమిట్లు గొలిపే కళ్లు.. మ్యాటర్ తెలిస్తే.!

కొమురంభీం జిల్లా పులుల అడ్డాలో నిషేదాజ్ఞలు కొనసాగుతున్నాయి. కాగజ్‌నగర్ కారిడార్‌లో‌ సాయంత్రం ఆరు దాటిందో నో ఎంట్రీ అన్న బోర్డ్‌లు దర్శనమిస్తున్నాయి. పులుల సంచారంతో రాకపోకలు నిషేదిస్తూ అటవిశాఖ నిర్ణయం తీసుకోవడంతో సాయంత్రం ఆరు దాటిందంటే ఆ ప్రాంతంలో..

రాత్రైందంటే ఆ ప్రాంతమంతా వింత శబ్దాలు.. మిరమిట్లు గొలిపే కళ్లు.. మ్యాటర్ తెలిస్తే.!
Kagaznagar Forest
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 16, 2024 | 1:30 PM

కొమురంభీం జిల్లా పులుల అడ్డాలో నిషేదాజ్ఞలు కొనసాగుతున్నాయి. కాగజ్‌నగర్ కారిడార్‌లో‌ సాయంత్రం ఆరు దాటిందో నో ఎంట్రీ అన్న బోర్డ్‌లు దర్శనమిస్తున్నాయి. పులుల సంచారంతో రాకపోకలు నిషేదిస్తూ అటవిశాఖ నిర్ణయం తీసుకోవడంతో సాయంత్రం ఆరు దాటిందంటే ఆ ప్రాంతంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. సూర్యస్తమయం నుండి సూర్యోదయం వరకు అభయారణ్యంలోకి ఎంట్రీ లేదంటూ రాకపోకలను నిలిపి వేస్తూ అటవిశాఖ అదికారులు ఎక్కడికక్కడ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం అంకుసాపూర్ నుంచి వాంకిడి వెళ్లే దారిని సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు మూసి వేస్తున్నామని చెప్తున్నారు అటవిశాఖ సిబ్బంది. ఈ మార్గంలో పులుల సంచారం పెరగడమే ఇందుకు కారణం అని అంటున్నారు. వేసవికాలంలో రాత్రుళ్లు పులులు రోడ్డుపైకి వస్తుండటంతో వాటి సంచారానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అటవిశాఖ అదికారులు పేర్కొన్నారు. స్థానిక ప్రజలు, ప్రయాణికులు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అటవిశాఖ నిషేదాజ్ఞలతో రాకపోకలు స్తంభించి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాంకిడి, అంకుసాపూర్ ప్రజలు. స్థానిక రైతులు, చిరు వ్యాపారులు సాయంత్రం ఆరులోపు ఇళ్లకు చేరుకోవాలని హెచ్చరిస్తున్నారు. కాలి నడకన ఈ మార్గంలో ఒంటరిగా అస్సలు వెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు అటవి శాఖ సిబ్బంది. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎక్కడికక్కడ చెక్ పోస్ట్‌లు ఏర్పాటు చేసి గస్తీ కాస్తున్నారు అటవిశాఖ అధికారులు. అత్యవసరమైతే ఎంఆర్వో అనుమతి తీసుకోవాలని కోరుతున్నారు.