Telangana: జనగామలో చదువుతున్న మగ్గురు విద్యార్థులు అదృశ్యం.. రంగంలోకి దిగిన పోలీసులు

| Edited By: Aravind B

Jul 13, 2023 | 3:37 PM

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటి కేశవపురంలోని జాక్సన్ మిషనరీ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యమవ్వడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే అశోక్(10), రమేష్ (12), ఎర్నిత్ (13) అనే ముగ్గురు విద్యార్థులు ఆ పాఠశాలలో చదువుకుంటూ హాస్టల్‌లో ఉంటున్నారు.

Telangana: జనగామలో చదువుతున్న మగ్గురు విద్యార్థులు అదృశ్యం.. రంగంలోకి దిగిన పోలీసులు
Students
Follow us on

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం పడమటి కేశవపురంలోని జాక్సన్ మిషనరీ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు అదృశ్యమవ్వడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే అశోక్(10), రమేష్ (12), ఎర్నిత్ (13) అనే ముగ్గురు విద్యార్థులు ఆ పాఠశాలలో చదువుకుంటూ హాస్టల్‌లో ఉంటున్నారు. అయితే బుధవారం సాయంత్రం ఈ ముగ్గురు విద్యార్థులు రహస్యంగా హస్టల్ నుంచి పారిపోయారు. దీంతో హాస్టల్ సిబ్బంది ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు.

దీంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌కు వెళ్లి కేసు నమోదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు అదృశ్యమైన విద్యార్థుల కోసం గాలిస్తున్నారు. అయితే ఆ విద్యార్థులు హస్టల్ నుంచి ఎందుకు పారిపోయారు.. ఏం జరిగింది అన్న విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు.

ఇవి కూడా చదవండి

( రిపోర్టర్: జీ.పెద్దీష్ కుమార్,వరంగల్ )