Saleshwaram: సలేశ్వరం జాతరలో అపశ్రుతి.. తొక్కిసలాటలో ముగ్గురు భక్తుల మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
నల్లమల ఫారెస్ట్ లోని సలేశ్వరం జాతరలో పరిస్థితి అదుపుతప్పింది. లింగమయ్య జాతరకు భక్తులు లక్షల్లో పోటెత్తడంతో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఊపిరి ఆడక నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన గొడుగు చంద్రయ్య (55) గుండెపోటుతో మృతిచెందాడు. అలాగే ఆమన్‌గల్ కు చెందిన విజయ (40) అనే మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది.

పదిమంది ఒకేసారి మీదడిపోతే ఎలాగుంటుంది!. ఊపిరాడదు కదా!. దాదాపు గుండె ఆగినంతపనవుతుంది!. అదే వందలు, వేలమంది గుంపులుగుంపులుగా తోసుకొని మీదపడితే ఎవరైనా బతికి బట్టకట్టగలరా!. సలేశ్వరం జాతరలో ఇప్పుడదే జరుగుతోంది. తోపులాట, తొక్కిసలాటతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు భక్తులు. నల్లమల ఫారెస్ట్ లోని సలేశ్వరం జాతరలో పరిస్థితి అదుపుతప్పింది. లింగమయ్య జాతరకు భక్తులు లక్షల్లో పోటెత్తడంతో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఊపిరి ఆడక నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన గొడుగు చంద్రయ్య (55) గుండెపోటుతో మృతిచెందాడు. అలాగే ఆమన్‌గల్ కు చెందిన విజయ (40) అనే మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. అంతకు ముందు అభిషేక్(32) ఊపిరాడక చనిపోయారు. మరికొందరికి తీవ్రగాయాలు కాగా.. వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. కాగా సలేశ్వరం జాతర కనీసం వారం నుంచి 10 రోజులపాటు నిర్వహించాలి. కానీ ఈ సారి కేవలం మూడు రోజులపాటు మాత్రమే నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీంతో పరిస్థితి పూర్తిగా అదుపుతప్పింది.
సలేశ్వరంలో అడుగుకో అపశృతి కనిపిస్తోంది. తోపులాట, తొక్కిసలాటలు జరుగుతున్నాయి. కొందరు స్పృహతప్పి పడిపోతుంటే, మరికొందరు ఊపిరాడక ప్రాణాలు వదిలేస్తున్నారు. అధికారుల ఆదేశాలను బేఖాతరుచేసిమరీ నల్లమలకు చీమల్లా క్యూకట్టారు భక్తులు. ఉగాది తర్వాత తొలి పౌర్ణమి కావడంతో అంచనాలకు మించి వచ్చారు. అయితే, త్వరగా దర్శనం చేసుకోవాలన్న ఆత్రుత, కంగారు ప్రాణాలకు మీదకు తెస్తోంది.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..