AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరంపై కుట్ర.. డ్రోన్‌ను కూల్చివేసిన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం..

అయోధ్యలోని రామమందిర పరిసరాల్లో అనుమానాస్పద డ్రోన్ ఎగురుతూ కనిపించడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా అధికారులు డ్రోన్‌ను నేలకూల్చారు. ఆలయానికి సమీపంలో ఇలాంటి ఘటనలు జరగడం భద్రతాపరమైన ఆందోళనలను రేకిత్తించింది.. వాస్తవానికి రామమందిర ప్రాంతంలో, ఆలయానికి దగ్గరగా డోన్లు ఉపయోగించడాన్ని ప్రభుత్వం నిషేధం విధించింది..

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరంపై కుట్ర.. డ్రోన్‌ను కూల్చివేసిన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం..
Ayodhya's Ram Mandir
Shaik Madar Saheb
|

Updated on: Feb 19, 2025 | 8:09 AM

Share

అయోధ్యలోని రామమందిర పరిసరాల్లో అనుమానాస్పద డ్రోన్ ఎగురుతూ కనిపించడం కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా అధికారులు డ్రోన్‌ను నేలకూల్చారు. ఆలయానికి సమీపంలో ఇలాంటి ఘటనలు జరగడం భద్రతాపరమైన ఆందోళనలను రేకిత్తించింది.. వాస్తవానికి రామమందిర ప్రాంతంలో, ఆలయానికి దగ్గరగా డోన్లు ఉపయోగించడాన్ని ప్రభుత్వం నిషేధం విధించింది.. అయితే, యాంటీ డ్రోన్ వ్యవస్థను పరీక్షిస్తున్న సమయంలో ఈ అనుమానాస్పద డ్రోన్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు. భద్రతా అధికారులు వెంటనే అప్రమత్తమై, డ్రోన్‌ను నేలకూల్చినట్లు ప్రకటించారు.

రామాలయం ప్రాంతంలో గందరగోళం సృష్టించేందుకు, పెద్ద సంఖ్యలో భక్తులను చంపేందుకు ఇది ఒక లోతైన కుట్ర అంటూ పేర్కొంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తు జరుగుతోందన్న పోలీసులు మరిన్ని వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు.

ముందుగా, బాంబు నిర్వీర్య దళం డ్రోన్ కెమెరాను క్షుణ్ణంగా పరిశీలించి, ఎటువంటి భద్రతా ముప్పు లేదని నిర్ధారించిందని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి రామ జన్మభూమి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

డ్రోన్ ను నేలకూల్చిన తర్వాత.. వెంటనే రంగంలోకి అధికారులు అనుమానిత వ్యక్తిని గుర్తించి, అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.. ప్రాథమిక విచారణలో, నిందితుడు హర్యానాలోని గురుగ్రామ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించినట్లు తెలిసింది. ఆలయ భద్రతను మరింత మెరుగుపరిచేందుకు నూతన భద్రతా చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలు నిర్ణయించాయి.

రామమందిర పరిసరాల్లో డ్రోన్ల నిషేధాన్ని మరింత కఠినతరం చేస్తున్నట్లు భద్రతా అధికారులు ప్రకటించారు. ఆలయానికి రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఎక్కడైనా డ్రోన్ ఎగురుతున్నా, యాంటీ డ్రోన్ వ్యవస్థ వెంటనే గుర్తించి చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు. రామమందిరం వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉండే కారణంగా, భద్రతా చర్యల్లో ఎటువంటి లోపం ఉండకూడదని.. ఈ ఘటన నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులు నిర్ణయించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ