Hyderabad: వీరంగం సృష్టించిన మందుబాబులు.. మూడు చోట్ల రోడ్డు ప్రమాదాలు..

మద్యం మత్తులో ఐదుగురు యువకుల వీరంగం సృష్టించారు. మైలార్ దేవరపల్లి ప్రాంతంలో కారులో మద్యం సేవిస్తూ డ్రైవింగ్ చేస్తున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అర్ధరాత్రి తాగిన మైకంలో యువకులు వేగం అదుపు చేయలేక డివైడర్ను ఢీకొట్టారు. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు ప్రమాదానికి గురై తీవ్రగాయాలు పాలయ్యారు. అక్కడ వారిని గమనించిన స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.

Hyderabad: వీరంగం సృష్టించిన మందుబాబులు.. మూడు చోట్ల రోడ్డు ప్రమాదాలు..
Road Accident

Edited By: Aravind B

Updated on: Aug 24, 2023 | 7:59 AM

హైదరాబాద్ న్యూస్, ఆగస్టు 24: మద్యం మత్తులో ఐదుగురు యువకుల వీరంగం సృష్టించారు. మైలార్ దేవరపల్లి ప్రాంతంలో కారులో మద్యం సేవిస్తూ డ్రైవింగ్ చేస్తున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అర్ధరాత్రి తాగిన మైకంలో యువకులు వేగం అదుపు చేయలేక డివైడర్ను ఢీకొట్టారు. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు ప్రమాదానికి గురై తీవ్రగాయాలు పాలయ్యారు. అక్కడ వారిని గమనించిన స్థానికులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఎప్పుడు రద్దీగా ఉండే హైదరాబాద్ నగరంలోని చదరఘాట్ ఏరియాలో మద్యం మత్తులో కారు విధ్వంసం సృష్టించింది. రాత్రి రద్దీగా ఉన్న చదరఘాట్ రోడ్డుపై అతివేగంగా దూసుకొచ్చిన కారు పలు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది. అందులో పలువురికి తీవ్ర గాయాలు కావడంతో అతివేగంతో కారు నడిపిన డ్రైవర్ ని పోలీసులు అదుపులో తీసుకొని ఉస్మానియాకి తరలించి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.

ప్రస్తుతం అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు… మరోవైపు రాజేంద్ర నగర్ ఏరియాలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ మందు బాబు అతివేగంతో టూ వీలర్ వాహనం తోలుతూ పోలీసులని ఢీకొన్నాడు ఈ ప్రమాదంలో ఓ పోలీస్ అధికారికి తీవ్ర గాయాలు కావడంతో పాటు టూవీలర్ వాహనం నడిపిన మందు బాబు కూడా తీవ్ర గాయాల పాలయ్యాడు ప్రస్తుతం అధికారికి హాస్పిటల్ తరలించి వైద్యం అందిస్తున్నారు మందుబాబుని కూడా పోలీసులు అదుపులో తీసుకొని వైద్యం అందిస్తున్నారు. ఇలా ఒకేసారి మూడు ప్రాంతాల్లో మందుబాబులు నడిపిన వాహనాలు ప్రమాదానికి గురి కావడం కలకలం రేపింది.

ఇక ఈ మధ్యకాలంలో చూసుకుంటే చాలావరకు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడపడం వల్లే అధికంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. అలాగే అధిక వేగం కూడా ఇలాంటి ప్రమాదాలకు కారణాలవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల చివరికి ఊహించని ప్రమాదాలు ఎదుర్కొనే పరిస్థితులు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. మద్యం తాగి అసలు వాహనాలు నడపకూడదని సూచనలు చేస్తున్నారు. మరోవైపు పలువురు నిపుణులు సైతం చాలామంది ఆయుష్షు నిండకుండానే ఇలా మధ్యలోనే మృతి చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, వేగాన్ని అదుపు చేస్తూ సురక్షితంగా గమ్యం చేరుకోవాలని సూచిస్తున్నారు. ఇలాంటి వాటిపై ప్రతిఒక్కరు అవగాహన చేసుకోవాలని కోరుతున్నారు. ఇదిలా ఉండగా రాత్రి సమయాల్లో ఎక్కువగా యాక్సిడెంట్లు జరగడం కూడా జరుగుతున్నాయని.. రాత్రి సమయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి