ఆ పనులన్ని పూర్తి చేయాలి.. భారాస ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలకు కేటీఆర్ సూచన

|

Mar 20, 2023 | 5:15 PM

పార్టీ విస్తృతంగా నిర్వహిస్తూ ఆత్మీయ సమ్మేళనాలు మరియు ఇతర కార్యక్రమాలను సమన్వయ పరుస్తున్న పార్టీ ఇంచార్జిలు, పార్టీ ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో మంత్రి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఆ పనులన్ని పూర్తి చేయాలి.. భారాస ఎమ్మెల్యేలు, ఇంఛార్జీలకు కేటీఆర్ సూచన
Minister KTR
Follow us on

పార్టీ విస్తృతంగా నిర్వహిస్తూ ఆత్మీయ సమ్మేళనాలు మరియు ఇతర కార్యక్రమాలను సమన్వయ పరుస్తున్న పార్టీ ఇంచార్జిలు, పార్టీ ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులతో మంత్రి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అకాల వర్షాల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న రైతులను స్థానిక వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించాలని ఆదేశించారు.రైతు సోదరులకు ప్రస్తుతం ఉన్న ఇబ్బందికర పరిస్థితుల్లో వారికి భరోసా ఇచ్చేలా విశ్వాసం కల్పించాలని సూచించారు.

 

సీఎం కేసీఆర్ గారి సూచన మేరకు పంచాయతీరాజ్ రోడ్ల బలోపేతం అంశం పైన దృష్టి సారించి వర్షాకాలం లోపల పనులు పూర్తయ్యేలా సమన్వయం చేసుకోవాలని కోరారు. అలాగే గ్రామస్థాయిలో ఉపాధి హామీ తో పాటు పంచాయతీరాజ్ శాఖ మరియు పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి వంటి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల బిల్లుల చెల్లింపు పైన ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిన నేపథ్యంలో వీటన్నింటిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉపాధి హామీకి సంబంధించిన 1300 కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వ నిధులు రాకుండా ఇంకా పెండింగ్లో ఉన్న నేపథ్యంలో బిల్లుల చెల్లింపు ఆలస్యమైందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

ప్రతి గ్రామాలకు నాలుగైదు డివిజన్లకు కలిపి ఒక ఆత్మీయ సమ్మేళనాలని ఏర్పాటు చేసుకోవాలని సూచించిన మేరకు ముందుకు పోవాలని సూచించారు. వచ్చేనెల 29 నాటికి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు పూర్తి కావాలని కోరారు. ఈ సమావేశాల్లో పార్టీ శ్రేణుల ప్రాధాన్యత తెలంగాణ ప్రగతి ప్రస్థానం, తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు, వచ్చిన తర్వాత మారిన రాష్ట్ర ముఖచిత్రం వంటి అంశాలను స్పృశించుకుంటూ రాష్ట్ర అభివృద్ధి ప్రస్థానాన్ని ప్రతీ కార్యకర్తకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. మహిళల అభివృద్ధి కోసం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మహిళా లోకానికి చేరేలా చూడాలని ఆదేశించారు.

 

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..