AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: సెల్ ఫోన్స్ లోడ్‌తో వెళ్తున్న వ్యాన్.. బైక్‌పై ఫాలో అయిన దుండగులు.. ఏంచేశారంటే..?

దొంగలు కొత్త కొత్త ప్లాన్లు వేస్తున్నారు. రోడ్లపై వెళ్తున్న వాహనాల్లో ఏం ఉన్నాయో తెలుసుకుని మరీ చోరీలకు పాల్పడుతున్నారు. ఆ వాహనాల్లో ఉన్న సరుకును మొత్తం లూటీ చేస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. సెల్ ఫోన్స్ లోడ్‌తో వెళ్తోన్న వ్యాన్‌ను దుండగులు వెంబడించారు. దీనికి సంబంధించి పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Telangana: సెల్ ఫోన్స్ లోడ్‌తో వెళ్తున్న వ్యాన్.. బైక్‌పై ఫాలో అయిన దుండగులు.. ఏంచేశారంటే..?
Cell Phones Van
Krishna S
|

Updated on: Jul 12, 2025 | 10:14 AM

Share

దొంగలు సరికొత్త దారులు తొక్కుతున్నారు. ఏ వాహనంలో ఏముందో తెలుసుకుని మరీ ఆ వాహనంలో ఉన్నవాటిని కొట్టేస్తున్నారు. గతంలో సెల్ ఫోన్ల చోరీ ఘటనలు గురించి ఎన్నోసార్లు విన్నాం. నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తి నుంచి సెల్ ఫోన్ లాక్కొని వెళ్లడం వంటివి చాలా జరిగాయి. ఇప్పుడు ఏకంగా సెల్ ఫోన్ల లోడ్‌తో వెళ్తున్న వ్యాన్‌నే లూటీ చేశారు కేటుగాళ్లు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. వ్యాన్‌ని వెంబడించిన దుండగులు లక్షల విలువ చేసే ఫోన్లను కొట్టేశారు. డ్రైవర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

నిజామాబాద్ జిల్లా టేక్రియాల్ బైపాస్ రోడ్డుపై సెల్ ఫోన్స్ లోడ్‌తో ఓ వ్యాన్ వెళ్తోంది. ఈ సమాచారం తెలుసుకున్న ఇద్దరు దుండగులు బైక్‌పై వ్యాన్‌ని వెంబడించారు. ముఖానికి కర్చీఫ్‌లు కట్టుకుని వ్యాన్‌ ఆపకపోతే చంపేస్తామంటూ డ్రైవర్‌ను బెదిరించారు. దీంతో భయపడ్డ డ్రైవర్ వ్యాన్‌ ఆపాడు. ఈ క్రమంలో సుమారు 4లక్షల విలువ చేసే ఫోన్లను దుండగులు ఎత్తుకెళ్లారు. వ్యాన్‌ డ్రైవర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. కొన్ని నెలల క్రితం ఇదే ప్రాంతంలో దుండుగులు కారుపై దాడి చేశారు. కారులోని వ్యక్తులపై దాడి చేసి ల్యాప్ టాప్, నగదు ఎత్తుకెళ్లారు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఐదేళ్ల క్రితం నెల్లూరు జిల్లాలోనూ ఇటువంటి ఘటనే జరిగింది. దుండగులు సెల్ ఫోన్స్ లోడ్‌తో వెళ్తున్న లారీనే అపహరించారు. కోల్‌కత్తాకు వెళ్తున్న లారీని ఆపి.. డ్రైవర్‌పై దాడికి దిగారు. డ్రైవర్‌ను కిందికి దించేసి లారీ తీసుకుని పరారయ్యారు. అప్పట్లో ఈ ఘటన సంచలనంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..