Telangana: భోజనానికి వెళ్లిన షాపు యజమాని.. తిరిగి వచ్చేసరికి షాక్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో భారీ చోరీ జరిగింది. నగల దుకాణంలో కస్టమర్‌గా వచ్చి మాటలతో ఏమార్చి 13 తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లాడు దొంగ. నగలు మాయమవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు షాపు యజమాని.  సీసీ కెమెరాల పుటేజ్ పరిశీలించిన పోలీసులు, దొంగ కోసం గాలిస్తున్నారు.

Telangana: భోజనానికి వెళ్లిన షాపు యజమాని.. తిరిగి వచ్చేసరికి షాక్
Thief In Gold Shop

Edited By:

Updated on: May 24, 2025 | 4:35 PM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో పట్టపగలు నగల దుకాణంలో ఓ భారీ దొంగతనం చోటుచేసుకుంది. రాజీవ్ గాంధీ నగర్‌లోని శ్రీవారి జ్యూయలరీ దుకాణంలోకి ఓ వ్యక్తి వెండి వస్తువులు కావాలంటు వచ్చాడు. మధ్యాహ్నం సమయంలో షాపు యజమాని భోజనానికి వెళ్లిన సమయం చూసుకొని పక్కా స్కెచ్‌తో దుకాణంలోకి ఎంటర్ అయిన దొంగ వర్కర్‌ని వెండి వస్తువులు కావాలంటూ మాటలతో ఏమార్చి దొంగతనానికి పాల్పడ్డాడు. దొంగతనం జరిగిన గంట తర్వాత షాపులో వస్తువులు చూసిన యజమానికి ఓ బంగారు నగలు ఉండే బాక్స్ కనిపించకపోవడంతో కంగారుగా సీసీ కెమెరాలు పరీక్షించారు. ఈ క్రమంలోనే వెండి వస్తువులు కావాలంటూ వచ్చిన వ్యక్తే చోరీకి పాల్పడిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు షాపు యజమాని. సుమారు 13 తులాల బంగారు ఆభరణాలు దొంగ ఎత్తుకెళ్లినట్లు యజమాని కళ్యాణి తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వీడియో దిగువన చూడండి… 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..