AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో స్లీపర్ సెల్స్ ఉన్నాయా? డీజీపీ స్టేట్‌మెంట్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

స్లీపర్ సెల్స్ అనేవి, సాధారణ జనం మధ్య గుట్టుచప్పుడు కాకుండా ఉండే ఉగ్రవాదుల గ్రూపులు లేదా ఉగ్రవాద సానుభూతి పరులు. వీరు నిర్దేశించిన సమయాల్లో రహస్యంగా ఉగ్ర కార్యకలాపాలు నెరుపుతూ ఉంటారు. గోప్యంగా పనిచేస్తూ, నిఘా వ్యవస్థలకు కనిపించకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. నిఘా వర్గాలు హెచ్చరికలతో స్లీపర్ సెల్స్ ఉన్నారా అనే విషయంపై అప్రమత్తమయ్యారు తెలంగాణ పోలీసులు.

హైదరాబాద్‌లో స్లీపర్ సెల్స్ ఉన్నాయా? డీజీపీ స్టేట్‌మెంట్ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
Hyderabad Terror Alert
Ranjith Muppidi
| Edited By: |

Updated on: May 24, 2025 | 5:55 PM

Share

హైదరాబాద్‌ మహానగరం, తెలంగాణ రాష్ట్ర రాజధాని, దేశంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా నిలిచింది. ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా ఉగ్రవాద మూలాలు ఉన్న వ్యక్తులు, స్లీపర్ సెల్స్ పట్టుబడుతూ ఉండటంతో, హైదరాబాద్‌ వంటి ప్రధాన నగరాల భద్రతపై విస్తృత చర్చ జరుగుతోంది. మొన్నీమధ్యే సికింద్రాబాద్‌ బోయగూడలో ఉగ్రవాద ఆనవాళ్లు బయటపడంతో కలకలం చెలరేగింది. తమ మధ్య ఉంటున్న యువకుడు బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తెలియగానే బస్తీవాసులు ఆందోళనకు గురయ్యారు.

విజయనగరంలో బాంబు పేలుళ్లకు రిహార్సల్స్‌ కోసం సరంజామా అంతా సిద్ధం చేసిన అక్కడి యువకుడు సిరాజ్, బోయగూడకు చెందిన సయ్యద్‌ సమీర్‌(28)ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును ఎన్‌ఐఏ డీల్ చేస్తోంది. తాజాగా తెలంగాణ డీజీపీ తెలంగాణ డీజీపీ జితేందర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్ హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో స్లీపర్ సెల్స్ ఉన్నాయా అన్న అనుమానాలకు తావిస్తోంది. హైదరాబాద్‌లో స్లీపర్‌ సెల్స్‌ను గుర్తిస్తున్నామని, వారికి కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు. ఇంటిలిజెన్స్, ఏజెన్సీలు పూర్తిగా అలెర్ట్‌గా ఉన్నాయన్నారు. నిఘా వర్గాలు హెచ్చరికలతో స్లీపర్ సెల్స్ ఉన్నారా అనే విషయంపై నిఘా ఉంచామన్నారు. స్లిపర్స్ సెల్స్ జాడ పట్టేందుకు ప్రత్యేక యూనిట్స్ ఏర్పాటు చేస్తామన్నారు. యాక్టివ్ అయిన స్లీపర్ సెల్స్‌ను గుర్తించి కౌన్సిలింగ్ ఇస్తామన్నారు. ఉగ్రవాదుల కదలికలపై ముందుగానే గమనించి అనేక మంది నిందితులను అరెస్టు చేశామని ఆయన తెలిపారు.

అసలు స్లీపర్ సెల్స్ అంటే ఏమిటి?

స్లీపర్ సెల్స్ అనేవి, సాధారణ జనం మధ్య గుట్టుచప్పుడు కాకుండా ఉండే ఉగ్రవాదుల గ్రూపులు లేదా ఉగ్రవాద సానుభూతి పరులు. వీరు నిర్దేశించిన సమయాల్లో రహస్యంగా ఉగ్ర కార్యకలాపాలు నెరుపుతూ ఉంటారు. గోప్యంగా పనిచేస్తూ, నిఘా వ్యవస్థలకు కనిపించకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు.

స్లీపర్ సెల్స్ లేదా ఉగ్రవాద గ్రూపులపై నిఘా ఉంచడం ద్వారా, తెలంగాణ పోలీసులు హైదరాబాద్ నగరాన్ని సురక్షితంగా ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. అవసరమైతే ప్రజలకు కౌన్సెలింగ్ అందించడం, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా పెంచడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండటం, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను పోలీసులకు తెలియజేయడం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..