Subha Muhurtham: కొత్త జంటలకు షాక్.. పెళ్లి చేసుకోవాలంటే 3 నెలలు ఆగాల్సిందే! కారణం ఇదే..

పెళ్లి చేసుకోవాలనుకునే జంటలకు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు చేపట్టే వారికి శుభ ముహూర్తాల కష్టాలు మొదలయ్యాయి. దాదాపు 83 రోజుల వరకూ మంచి ముహూర్తాలు లేవని వేద పండితులు సూచిస్తున్నారు. శుక్ర మౌడ్యమి ఉండడమే కారణం. పెళ్లి చేసుకోవాలన్నా.. గృహప్రవేశాలు చేయాలన్నా..

Subha Muhurtham: కొత్త జంటలకు షాక్.. పెళ్లి చేసుకోవాలంటే 3 నెలలు ఆగాల్సిందే! కారణం ఇదే..
Marriage Subha Muhurtham

Edited By: Srilakshmi C

Updated on: Nov 25, 2025 | 4:52 PM

పెళ్లి చేసుకోవాలనుకునే జంటలకు, గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలు చేపట్టే వారికి శుభ ముహూర్తాల కష్టాలు మొదలయ్యాయి. దాదాపు 83 రోజుల వరకూ మంచి ముహూర్తాలు లేవని వేద పండితులు సూచిస్తున్నారు. శుక్ర మౌడ్యమి ఉండడమే కారణం. పెళ్లి చేసుకోవాలన్నా.. గృహప్రవేశాలు చేయాలన్నా.. ఎలాంటి శుభకార్యాలు చేసుకోవాలన్నా సుమారు మూడు నెలల పాటు వేచి చూడాల్సిందే.. కొత్తజంటలకు శుక్ర మౌడ్యమి శుభ ముహూర్తల గండం వెంటాడుతుంది. నవంబర్ 26 నుండి 2026 ఫిబ్రవరి 18 వరకు మంచి ముహూర్తాలు లేవని వేద పండితులు చెబుతున్నారు.. ఎలాంటి శుభకార్యం చేయాలన్నా వేచి చూడాల్సిందేనని చెప్తున్నారు.

మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి మాఘ మాసం బహుళ అమావాస్య వరకు.. అంటే నవంబర్ 26 నుంచి ఫిబ్రవరి 17 వరకూ 83 రోజులపాటు మౌఢ్యమి ఉంటుందని, అప్పటి వరకూ శుభ ముహూర్తాలు లేవని పేర్కొన్నారు. గురు, శుక్ర గ్రహాలు సూర్యుడికి దగ్గరగా వచ్చే కాలాన్ని మూఢంగా పరిగణిస్తారు. ఈ సమయంలో రెండు గ్రహాలు బలంగా ఉండవని, అందుకే వివాహం, నూతన గృహప్రవేశం, విగ్రహ ప్రతిష్ఠలు వంటి కార్యక్రమాలు నిర్వహించ వద్దని వేద పండితులు సూచిస్తున్నారు.

ఐతే తప్పనిసరిగా చేసే పనులు, నిత్యకర్మలకు మూఢమి వర్తించదని సూచిస్తున్నారు.. ప్రతి సంవత్సరం మాఘమాసంలో పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండేవి. ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాల్స్ ఏవీ ఖాళీ ఉండేవి కాదు. కానీ ఈసారి మాఘమాసంలో మూఢమి ఉండటంతో పెళ్లి ముహూర్తాలు కూడా లేక బుకింగ్స్ లేవని ఫంక్షన్ హాళ్ల నిర్వాహకులు వాపోతున్నారు.. పెళ్లి బాజాబజంత్రిలు మొగాలంటే ముహూర్తం కోసం మూడు నెలలు ఆగాల్సిందే…

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.