Telangana: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ప్రభుత్వం..
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను వెంటనే విచారణకు తీసుకోవాలని..
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను వెంటనే విచారణకు తీసుకోవాలని ధర్మాసనాన్ని ప్రభుత్వ తరఫు న్యాయవాది దుష్యంత్ దవే కోరారు. సీబీఐ విచారణ ప్రారంభిస్తే.. సాక్ష్యాలు ధ్వంసమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే వారం విచారణకు అనుమతి ఇస్తామని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. కాగా.. తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్ ను సమర్ధించిన డివిజన్ బెంజ్.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐతో దర్యాప్తు చేపించాలని ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
ఇప్పటికే పలు ట్విస్ట్‌లు చోటుచేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై ఏం జరుగుతుందనే ఉత్కంఠ అందరిలో ఏర్పడింది. సీబీఐతో విచారణకు గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. ఈ ఆదేశాలపై తెలంగాణ సర్కార్.. డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది. కాగా ఈ పిటిషన్ పై దర్యాప్తు చేపట్టిన హైకోర్టు సీబీఐ దర్యాప్తునకే మొగ్గు చూపింది. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
కాగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. మోయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో కొందరు వ్యక్తులు.. తమను ప్రలోభపెట్టారన్న వ్యాఖ్యలు కలకలం రేపాయి. డబ్బు ఆశ చూపారని, పార్టీ మారేందుకు ఒత్తిడి చేశారని వివరించారు. దీంతో ఈ కేసు పలు మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం సీబీఐ విచారణకు హైకోర్టు అనుమతి పొందింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం