Bandi Sanjay: 119 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ముందా.. ఓవైసీ సోదరులకు బండి సంజయ్‌ సవాల్‌..

ఓవైసీ సోదరులకు బండి సంజయ్‌ సూటిగా ఓ సవాల్‌ విసిరారు. మీకా దమ్ముందా అంటూ ఛాలెంజ్‌ విసిరారు.

Bandi Sanjay: 119 నియోజకవర్గాల్లో పోటీ చేసే దమ్ముందా.. ఓవైసీ సోదరులకు బండి సంజయ్‌ సవాల్‌..
Bandi Sanjay
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 07, 2023 | 6:44 PM

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. దమ్ముంటే 119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఛాలెంజ్ చేశారు. 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఎన్ని నియోజకవర్గాలలో డిపాజిట్ వస్తుందో అందరికీ తెలుస్తుందని.. డిపాజిట్లు వస్తాయా..? ఎంఐఎం సత్తా ఏంటో 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే గాని తెలియదన్నారు. ఇటీవల అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ సెటైర్లు సంధించారు. బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ప్రజల్లో విద్వెషం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఇస్లాం అంటే వ్యతిరేకత తమకు లేదన్నారు.

ప్రజాగోస – బిజేపీ భరోసా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పై వక్తలకు శిక్షణ తరగతుల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 10 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడించారు. రోజుకు 600 బహిరంగ సభలు, 11 వేల శక్తి కేంద్రాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ఇబ్రహీంపట్నం మన్నెగూడలోని వేద కన్వెన్షన్ లో వక్తలకు నిర్వహించిన వర్క్ షాప్‌లో బండి సంజయ్ మాట్లాడారు.

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బిజేపీ గెలుపు తధ్యమన్నారు. స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ లో జనం రాలేదని ఫీల్ కావొద్దని.. బస్తీల సమావేశాల్లో వంద మంది ఉన్నా, రెండు వందల మంది ఉన్నా స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పెట్టాలన్నారు. ఏడాది కాలంలో 15 భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేశామన్నారు. కార్యకర్తలను నాయకులుగా తయారు చేయడమే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లక్ష్యమన్నారు. తెలంగాణ బీజేపీని సీఎం కేసీఆర్ హేళన చేశారని.. ఇబ్బంది పెట్టారని అన్నారు.

ఎంఐఎం, టీఆర్ఎస్ కలిసి హైదరాబాద్ మేయర్ పదవి దక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులు కరువయ్యారని.. కాంగ్రెస్ పార్టీ కంప్రమైజ్ పార్టీగా మారిందన్నారు. కాంగ్రెస్ పార్టీ లో గెలిచిన వారు హొల్ సెల్‌గా బీఆర్ఎస్‌కు అమ్ముడుపోతున్నారని ఎద్దేవ చేశారు.ప్రజలకు బీజేపీపై నమ్మకం పెంచాలన్నారు. 11 వేల స్ట్రీట్ కార్నర్ విజయవంతం చేస్తే.. సునాయాసంగా బిజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి కేసీఆర్ బంధం తెగిపోయిందని.. ప్రజలను మభ్య పెట్టి, మాయచేసేందుకే బీఆర్ఎస్ పార్టీ పెట్టారని విమర్శించారు.

అసెంబ్లీ బడ్జెట్‌లో హరీష్ రావు అన్ని అబద్ధాలే చెప్పారని.. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరా కూడా అదనంగా నీరు ఇయ్యలేదన్నారు. కేసీఆర్ తన బిడ్డ కవిత గురించి ఎక్కడ ప్రస్తావించడం లేదన్నారు. ఉద్యోగాల భర్తీకి 22 నోటిఫికేషన్లు ఇచ్చారు.. ఒక్క నోటిఫికేషన్ కూడా సక్రమంగా లేదన్నారు.  తెలంగాణలో ధరణితో నలుగురు కలెక్టర్లు.. సీఎం కుటుంబానికి దోచిపెట్టేందుకు పనిచేస్తున్నారని విమర్శించారు. ఆ నలుగురు కలెక్టర్ల అవినీతిపై ఆధారాలు ఉన్నాయని.. అతి త్వరలోనే ఆ నివేదిక బయట పెడతామన్నారు.

కార్యకర్తలు నిరాశ పడవద్దు.. లక్ష్యం కోసం పనిచేసేందుకు కసితో ఉండాలన్నారు. రాజకీయాల్లో పిరికితనం పనికిరాదన్నారు. సెంటిమెంటును అడ్డం పెట్టి టీఆర్ఎస్ గెలిచిందన్నారు. ఒక సెక్షన్ మీడియా సహకారం బీజేపీకి లేదన్నారు.

చాన్నాళ్ల యాజమాన్యాలను బీఆర్ఎస్ పార్టీ బెదిరించి లొంగ దీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలు లేరు.. బీఆర్ఎస్ ఇలాంటి మీటింగ్స్ పెట్టలేదు. బిజేపీ మాత్రమే శక్తి కేంద్రాల వారీగా మీటింగ్స్ పెడుతుందన్నారు. 8 నెలల పాటు కార్యకర్తలు సమయం ఇవ్వాల్సిందే.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను 2 లక్షల 40 వేల మంది లబ్ధిదారుల జాబితా పంపాలని కేంద్రమంత్రి కోరితే.. ఇప్పటి వరకు పంపలేదని తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.

ఇదిలావుంటే, ఎంఐఎం పార్టీకి ఉన్నది ఏడుగురు ఎమ్మెల్యేలే అన్న మంత్రి కేటీఆర్ కామెంట్లను సీరియస్‌గా తీసుకుంటున్నామని ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎంఐఎం 50 స్థానాల్లో పోటీ చేస్తామంటుూ మంత్రి కేటీఆర్‌తో అక్బరుద్దీన్ సవాల్ విసిరిన నేపథ్యంలో బండి సంజయ్ ఈ ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్ తో తమకు సంబంధం లేదని చెప్పడానికే డ్రామాలు రెండు పార్టీలు మొదలు పెట్టాయని బండి సంజయ్ ఆరోపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం